బుద్ధి-సునిశితత్వము సూక్ష్మత్వము తీక్షణత్వము

సునిశితత్వము సూక్ష్మత్వము తీక్షణత్వము

Click here to Download this Audio [28mb]

            మన mind ఎప్పుడూకూడాను సాధ్యమైనంతవరకు “A=B” లాగా చెప్పమంటుంది. అంతేనా? కాదా? ఏమైనా కొద్దిగా తేడాగా చెప్తే? నాకు చేతకావటం లేదు. అంతేనా? కాదా?
మీరెవరైనా 100 మందికి పరమాన్నం కాచారా ఎప్పుడైనా? కాయలేదా? ఎన్ని పాలు కావాలి? ఎన్ని జీడిపప్పులు కావాలి? ఎన్ని యాలక్కాయలు కావాలి?

  • ·       అన్నిటికి మన దగ్గర answer ఏముంది?
లేదు, తెలియదు, కాదు.

  • ·       ఒక వేళ (answer) చెప్పాల్సే వస్తే?
చాలా, అయ్యిండచ్చు.
ఇవి బుద్ధిanswers అండీ! ఎప్పుడైనా గుర్తుపెట్టకోండి. అంటే దాని boundary అవతల ప్రశ్నలు వచ్చినాయనుకోండి, అప్పుడేమి చేస్తుంది? ఇలాంటి answers చెప్తుంది.

 “ప్రారబ్ధం అనేది బుద్ధికి లోపల వుండి పని చేస్తుందా? అవతల వుండి పనిచేస్తుందా?
ప్రారబ్ధం అనేది బుద్ధి అనే పరిమితికి లోపల వుండి పని చేస్తుందా? అవతల వుండి పనిచేస్తుందా?  ఈ లోపల ఏమిటి? ఆ అవతలఏమిటి అనే సందేహం రావడంలేదు. ఆ ప్రశ్న రాకపోతే లోపల ఏదో బయిట ఏదో తెలియదు.
సూత్రం ఏమిటి అసలు?
బుద్ధి కర్మానుసారిణి
అంటే కర్మ’ is the Leader, ‘బుద్ధి’ is the Follower.
ఇప్పుడు బుద్ధికి బయట వుంటుందా బుద్ధిని Lead చేసేది, బుద్ధికి లోపలే వుంటుందా?
బుద్ధిని lead చేసేది బుద్ధికి అవతల వుంటుందా? బుద్ధికి లోపల వుంటుందా?
బుద్ధికి అవతల వుంటుంది. మరి ఇప్పటివరకూ ఏమన్నావ్‌ అయిపోయే.
అర్థమైందా? అండీ! శాస్త్రంలో చెప్పిన సూత్రాన్ని సవ్యంగా మనం అర్థం చేసుకోలేక పోవడం. అగ్రహణం’, ‘అన్యథా గ్రహణం.
బుద్ధి మిమ్మల్ని బుట్టలో వేయడానికి రెండు వున్నాయి దాని దగ్గర. ఏమున్నాయి? అగ్రహణం’, ‘అన్యథా గ్రహణం’. అయితే అసలు తెలుసుకోకుండా చేస్తుంది. ఇప్పుడు మీకు బుద్ధి కర్మాను సారిణి తెలియదా? తెలుసు కానీ ఎలా apply చేయాలో తెలియదు. ఎక్కడ apply చేయాలో తెలియదు. అందువల్ల ఏమైంది? అగ్రహణం. తెలుసుగానీ స్పష్టత లేదు. ఎందుకు లేదు? అన్యథాగ్రహణం. సగం మనకు తెలిసింది, సగం శాస్త్రం చెప్పింది. సగం దేశంలో తెలుసుకుంది. అక్కడివి అక్కడక్కడ ఏరుకొచ్చాం. విన్నది, కన్నది, చూచింది ఇవన్నీ కలిపి బుద్ధిలో ఒక పెద్ద సంచి తయారౌతుంది. మూట తయారౌతుంది. ఆ మూటలోనుంచే answers చెప్తుందది ఎప్పుడూ. ఆ మూటలో లేదనుకోండి, ఏం చేస్తుంది? ఇందాక చెప్పలా? అదే ఒక catering వాళ్ళని పిలిచి అడగామనుకోండి,
ఏమండీ, 100 మందికి రేపు పాయిసం పెట్టాలి, ఏం కావాలయ్యా?
List చదివేస్తాడు టక టక టక. అవునా? కాదా?
మనల్ని అడిగితే?
Easy calculation ఏమంటే, 10 మందికి ఇంట్లో చేస్తావ్‌ కదా, 10x10 వేస్కో.
2 లీటర్ల పాలు 5 గురికి సరిపోయేటట్లయితే, 4 లీటర్ల పాలు 10 మందికి సరిపోయేటట్లయితే, 100 మందికి కావాలంటే 4 x 10 = 40 లీటర్లు వేసుకో.

అయితే, భౌతికమైన అంశాలకొచ్చేటప్పటికి ఇలా బానేవుంది. మీ ప్రారబ్ధంతెలుసుకోవాలంటే? అడగండి దానిని.
నా ప్రారబ్ధంఏంటో నేను తెలుసుకో దలచుకున్నాను, నువ్వేమన్నా సహయం చేస్తావా?
ఏం చెప్తుందండి బుద్ధి?
నేనే దానికి (ప్రారబ్ధానికి) follower ని. అంతేనా? కాదా?
బుద్ధిదేనికి follower?
కర్మవశాత్‌ వున్న లక్షణాలు ఏవైతే వున్నాయో, దానికి follower.
కానీ, మరి అట్లా అయ్యేటట్లయితే, ఇప్పుడీ బుద్ధి వల్లే చైతన్యాన్ని తెలుసుకోగలవని కదా శాస్త్రం చెప్తుంది? బుద్ధి గ్రాహ్య మతీంద్రియం”. ఇంద్రియాలకు అవతల వున్నటు వంటి, ఇంద్రియాలను నడిపేటటువంటి, ఇంద్రియాలను స్వాధీన పరుచుకున్నటువంటి ఏ శక్తి అయితే వుందో, ఏ చైతన్యమైతే వుందో, ఏ ప్రజ్ఞ అయితే వుందో, ఏ ఆత్మ అయితే వుందో, ఏ బ్రహ్మమైతే వుందో వాటినన్నింటినీ దేనితో తెలుసుకోగలవు? బుద్ధితోనే తెలుసుకోవాలి. వేరే వాటితో తెలుసుకోవడానికి వీలుకాదు. అని శాస్త్రం కచ్చితంగా చెప్తుంది. గురువుగారు బోధలో చెప్తున్నారు. సాంఖ్యం అంతా దీని చుట్టూనే కదా తిరిగేది. బుద్ధి గ్రాహ్య మతీంద్రియం.
మరి మన బుద్ధి గ్రహిస్తోందా అతీంద్రియ జ్ఞానాన్ని? కేవలం ఇంద్రియాల పరిమితిలోనే గ్రహిస్తోందా?
కళ్ళు చూస్తున్నాయని తెలుస్తోంది. జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుస్తోంది.
అతీంద్రియం అంటే?
అయిపోయే, దానికి తెలియదు. అతీంద్రియం అంటే తెలియదండీ, answer చెప్తదది. బుద్ధి గ్రాహ్య మతీంద్రియం అని సూత్రం వున్నది కదా, అతీంద్రియం నీకెప్పుడైనా తెలిసిందా? నీ పూర్వ పరిజ్ఞానంలో అతీంద్రియం ఎప్పుడైనా వుందా? ఇంద్రియములను అతిక్రమించినటువంటి. ఇంద్రియాతీతమైనటువంటి. ఆ జ్ఞానం మనకు ఎప్పుడైనా స్ఫురించిందా? ఆ రకమైన లక్షణాలు మనలో ఎప్పుడైనా పొడసూపినాయా?
ఎవరైనా మనం రోడ్డుమీద వెళ్తున్నారండీ. బొక్కబోర్ల పడ్డాడండీ పిల్లాడు. Top to Bottom వాడికేవో దెబ్బ తగిలినాయండి. మన పిల్లాడు కాదండి. అయినా కూడా మనకు దయ కలిగిందా? (కలిగింది) కలిగిందా? ఆహా!
దయ ఏ ఇంద్రియాలకు లోబడి వుంటుంది?
దయను ఎవరి ఖాతాలో వేద్దాం?
జ్ఞానేంద్రియాలా? పోనీ కర్మేంద్రియాలా?
అదుగోండి, ఇక్కడెవరో హృదయం అంటున్నారు మళ్ళీ.
మనసా? బుద్ధియా? చిత్తమా? అహంకారమా? అవేగా అంతరింద్రియాలు. పోనీ వాటి ఖాతాలో వేద్దామా? ఈ దయని. ఆవెడేమో మనసు ఖాతాలో వేద్దామంటోంది. ఎలా? ఎవరి ఖాతాలో వేద్దాం ఈ దయ’ ?
సరే, దయకొద్దిగా అధికమైంది. కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చినాయి. అయ్యో! ఈ పిల్లవాడికి ఈ విధంగా జరిగిందే అని. అర్థమైందా అండీ? వీడిని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్ళాం, వైద్యం కూడా చేయించుకొచ్చాం, ఆ పిల్లాడిని ఓదార్చం. ఆ పిల్లవాడికి స్వస్థత చేకూరేటట్లుగా మాట్లాడాం. ఆ పిల్లవాడి తల్లిదండ్రులెవరో తెలుసుకున్నాం. వాళ్ళకు తెలియజేశాం. వాడికి సరైన వైద్యం అందేట్టుగా చూశాం. వాడిని సరిగ్గా ఆనంద స్థితిలో నెలకొల్పడానికి వాడికేదో ఆహారమో లేకపోతే మరొకటో ఏది అవసరమో అది తీర్చాం. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చే లోపల ఇదంతా కూడా చేసేసాం. ఇప్పుడు దీనికేం పేరు పెడతావ్‌?
మొదట భావనలో దయ’, దయ’ action లోకి దిగింది ఇప్పుడు. దిగిందా? దిగలేదా? దిగిచేశావ్‌. (కరుణ) అది అటండీ! రెండక్షరాలు కాస్తా ఏమైంది ఇప్పుడు? మూడక్షరాలైంది. దయ కాస్తా ఏమైంది? కరుణ. ఇప్పుడీ కరుణని ఏ ఇంద్రియాల ఖాతాలో వేద్దాం? జ్ఞానేంద్రియాలా? కర్మేంద్రియాలా? అంతరేంద్రియాలా? ఎందులో వేస్తావ్‌? లేవా ఇవి మనకి? ఇవి జీవితంలో ఎప్పుడూ experience కాలేదా? ఇవి అసలు experience అయినాయా? అవలేదా? జీవితంలో. Experience కాలేదనుకోండి, అప్పుడు museum లో పెట్టాల్సిందే. మనిషిగా పనికిరాం మనం. అప్పుడు మనం మనిషిగా పనికిరాం. ఇవి experience అయినాయి కదా జీవితంలో. మరి ఇవి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ ఖాతాలో వేద్దాం.
అదుగోండి హృదయంఖాతాలో వేయాలట. మరి ఈ హృదయం అనేది బుద్ధి పరిమితికి లోబడి వుందా? అవతల వుందా?
(అవతల వుంది). అందరూ ఒప్పుకుంటారా? Did you ever felt ఇది బుద్ధికి అవతల వుంది. అంటే హృదయంమేల్కొని పనిచేసేటప్పుడు, బుద్ధిచెప్పేటటువంటి అంశాలు ఏవీ కూడా మీరు పరిగణలోకి తీసుకోరు. ఇది చాలా చెప్తుంది. ఆ దయ’, ‘కరుణకి లోబడి చేసేటప్పుడు నీకు చాలా చెప్తుందిది. అమ్మో! అది అలా చేస్తే ఇది ఇలా అవుతుంది. ఇది ఇలా చేస్తే అలా అవుతుంది. అక్కడ doctor దగ్గరకు వెళ్తే ఎలా జరిగిందని అడుగుతాడు. వాడు అలా చెప్పాలి. నువ్వు ఇలా ఇరుక్కుంటావ్‌. నువ్వు అలా అవుతావ్‌. నీకు ఇలాంటి risk వస్తుంది. ఇలా చెప్పదా అది ఏమి?
నోర్ముయ్‌! అంటావ్‌ అప్పుడు. ఏం చేస్తంది అప్పుడు? You are committed. దయ’, ‘కరుణ అనేటటు వంటి దైవీ లక్షణాలు ఎన్నైతే వున్నాయో, దైవాసురసంపద్విభాగ యోగంలో చెప్తున్న దైవీ లక్షణాలు మనలో మేల్కోగానే, అర్థమైందా? ఈ బుద్ధి ఏం చేస్తుంది? దీని సహజలక్షణం ఏం చేయటం? నిన్ను అటు పోనివ్వకుండా, ఆ పార్టీలోకి పోనివ్వకుండా ఈ పార్టీలోనే వుంచే ప్రయత్నం చేస్తుందన్నమాట అదెప్పుడు, ఆ గోడ దాటనివ్వదది. అతిక్రమించనివ్వదన్నమాట. చెప్తూ వుంటుందిది వెనకాల నుంచి. చెప్తూవుంటే ఏం చేస్తావ్‌? Please keep silence. అని ఒకసారి దానికి చెప్తే, ఇంకా అది మళ్ళా మాట్లాడుతుందా? నీ పని అయ్యేవరకు అది అడ్డం రాదండీ!
ఒకవేళ ఆ దైవీలక్షణాలతో నువ్వు పని చేశావ్‌. అర్థమైందా? అండీ! కొద్దిగా Result లో తేడా వచ్చింది. రాకూడదనేమీ Rule లేదుగా. వంట బానే తయారుచేశామండీ, పొరపాటున అది చేదుగా తయారైంది. మనమేం చేస్తాం దానికి? Something he went wrong. Can you revert it? ఆ వంటకాన్ని విసిరి అవతల పారేసి మళ్ళా కొత్తది తయారు చేసుకోవలసినదే. అంతేనా? కాదా? So what? ఇప్పుడేమన్నా ప్రమాదం వచ్చిందా? ఏమీ రాలేదు. కానీ నేనే చేశానుఅన్న భావన అందులోకి చేరింది. అప్పుడేమైంది? ఇంకేమైంది అప్పుడు? అంతకు ముందు వున్న హృదయం కాస్తా ఏమైపోయిందిప్పుడు? అది silent అయిపోయింది, ఇప్పుడు ఎవరు ముందుకు వచ్చారు? అసలు hero ముందుకు వచ్చాడన్నమాట. వీడేం చేశాడు? ముందే చెప్పానా? నేను హెచ్చరిస్తూనే వున్నానా? నా మాట వినకుండా నెత్తిమీద పెట్టుకున్నావ్‌ అంటాడు. అనంగానే మనమేమి అంటాం? ఏదో అలా అయిపోయింది. అని నిర్వేదాన్ని వ్యక్తం చేస్తాం. నిజానికి ఆ హృదయానికి అధిష్ఠానం నువ్వే. ఈ బుద్ధికి అధిష్ఠానం కూడా నువ్వే. నీ decision మేరకే అవి రెండు work చేస్తున్నాయి. వాటంతట అవి స్వయంగా పనిచేయడం లేదండి. అర్థమైందా? నిన్ను ఎవరి ఖాతాలో వేద్దాం? నిన్ను జ్ఞానేంద్రియాల ఖాతాలో వేద్దామా? కర్మేంద్రియాల ఖాతాలో వేద్దామా? అంతరేంద్రియాల ఖాతాలో వేద్దామా? ఎవరి ఖాతాలో వేద్దాం? అర్థమైందా? అండీ!
నిన్ను ఇంద్రియాల ఖాతాలో వేస్తే నువ్వు కూడా ఏమైపోతావ్‌? జడవస్తువు అయిపోతావ్‌. అది గుర్తుపెట్టుకోండి. నిన్ను ఏ ఇంద్రియం ఖాతాలో వేసినా కూడా, చైతన్య వస్తువు అయినటువంటి నువ్వు కాస్తా ఎందులోకి వెళ్ళిపోతావ్‌? జడమైపోతావ్‌. అర్థమైందా అండీ? మీ ఇంట్లో ఏ వస్తువు మీరు? మీ ఇంట్లో ఏ వస్తువు మీరు? మీకు తెలియనివి, మీరు కొననివి, మీరు చూడనివి, మీకు అజ్ఞానం అంశాలు ఏమన్నా వున్నాయా మీ ఇంట్లో. ఏం లేవుగా. ఏ వస్తువు మీరు? మీ ఇంట్లో ఏ వస్తువు మీరు? (ఏ వస్తువు కాదు). మరి మీ జ్ఞానేంద్రియాలు మీకు తెలియదా? మీ కర్మేంద్రియాలు మీకు తెలియదా? మీ అంతరేంద్రియాలు మీకు తెలియదా? ఏ ఇంద్రియం మీరు?

(ఏ ఇంద్రియము నేను కాదు) కానీ, అలా వుంటున్నామా? అది చాలా ముఖ్యం. ఈ ప్రశ్న వేసుకోవాలన్నమాట. నేను అన్నింటిని తెలుసుకునేవాడను, ఆజ్ఞాపించేవాడను. వీటన్నింటి యొక్క వ్యవహారాన్ని తెలుసుకునేవాడను, ఆజ్ఞాపించేవాడను.
ఎట్లా?
మా ఇంట్లో వస్తువుల్లాగానే.
మీ ఇంట్లో వస్తువులేవీ మీకు తెలిదా?
అన్నీ తెలుసు.
ఏ వస్తువు మీరు? ఏదీ కాదు.
ఎందుకనీ?
అవి జడం, నేను చేతనం.
ఒప్పుకోరెవ్వరు, ఈ భూప్రపంచంలో ఎవ్వరూ ఒప్పుకోరండి,
పిల్లాడికి పుస్తకం ఇచ్చి, పుస్తకంనువ్వేనా? అని అడుగు.
కాదంటాడు.
వాడికి ఎంతో ఇష్టమైన బొమ్మ ఇవ్వు.
బొమ్మ నువ్వేనారా అంటే?
నేను కాదంటాడు, నేను బొమ్మ ఎట్లా అవుతాను? Never.
చిన్నపిల్లవాడు ఒప్పుకున్న సత్యాన్ని, మనం ఎదిగే కొద్ది ఒప్పుకోవడం మానేశాం. అర్థమైందా? అండీ!
చిన్న పిల్లవాడికి బొమ్మ ఇచ్చి అడగండి, ఈ బొమ్మ నువ్వేనా? అంటే,
కాదంటాడు వాడు, నా బొమ్మ అంటాడు వాడు. నేను’ – అనడు.

మీరు కూడా అట్లాగే చెప్తున్నారు. కానీ రోజువారీ నిత్య జీవితంలో మాత్రం ఆచరించేటప్పుడు, ఆలోచన కలగగానే, ఒక ఆలోచన రాగానే, విచారణ రాగానే, అందులో నిర్ణయం తీసుకునే స్థితి రాగానే, ఆ ఇంద్రియం నువ్వు అయిపోయిన ధర్మాన్ని నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇది వ్యవహార జ్ఞానంలో వచ్చినటువంటి లోపం.

వ్యవహార జ్ఞానంలో వచ్చిన లోపం వల్లనే, కర్మచేత ప్రభావితం అవుతున్నావు. లేకపోతే నిజానికి నీకు కర్మ లేదు. వాస్తవానికి స్వరూపజ్ఞానంలో ఎవరైతే వుంటారో, వాళ్లకి కర్మకూడా జడవస్తువే. మీ ఇంట్లో వస్తువులన్నీ ఎలాగో, ఈ సృష్టి ధర్మాన్ని నడపడానికి, భగవంతుని చేతిలో కర్మఒక పనిముట్టు. ఈశ్వరుని చేతిలో కర్మ ఒక పనిముట్టు. కర్మఫలప్రదాత ఈశ్వరుడు. దాని ఆధారంగానే సమస్త జీవరాశులను కూడా పరిణామం చెందిస్తున్నాడు. నిన్ను ఒక్కడినే కాదు. అమీబానుంచి మనిషి వరకూ. సర్వజీవరాశులు పరిణామం చెందుతున్నాయంటే, ఆ ఒక్క సిద్ధాంతం చేతనే. ఆ ఒక్క ధర్మం చేతనే. సూర్యుడు ప్రకాశించడం ఎంత సత్యమో, సమస్త జీవులు కర్మసిద్ధాంతం నకు లోబడి పరిణామం చెందుతూ ఉంటాయి అదే సత్యం.
అయితే, మన బుద్ధి ఎప్పుడూ ఏం చేస్తూ వుంటుంది ఎప్పుడూ? బుద్ధి ఆ ఈశ్వర ఆధీనమైనకర్మని follow అవ్వాలా వద్దా ఇప్పుడు? అయితేనేగా అది కుదిరేది. కానీ మనం ఎప్పుడూ మనం ఏమంటాం? ఇందాకే చెప్పాను బుద్ధి ఎప్పుడూ ఏం చేస్తుందండి? Opposite ‘అగ్రహణము, అన్యథాగ్రహణము వల్ల అది సృష్టిధర్మాన్ని ఎరగడానికి ఒప్పుకోదు.  Reverse ఆలోచిస్తుంది. ఉల్టా ఆలోచించి, జ్ఞానాన్ని నిర్ణయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కారణం ఏమిటంటే, బుద్ధి సాపేక్ష జ్ఞానాన్ని తొందరగా గుర్తుపడుతుంది. అంటే,
ఒక తెల్లటి పేపర్‌ మీద, ఒక నల్లటి చుక్కను గుర్తించాలి. Easy ఏనా?
ఒక నల్లటి పేపర్‌ మీద, ఒక తెల్లని చుక్కను గుర్తించాలి.
ఈ రెండిటిలో ఏది easy?
ఒక తెల్లటి పేపర్‌ మీద, ఒక నల్లటి చుక్క - Easy ఏనా?
ఒక నల్లటి పేపర్‌ మీద, ఒక తెల్లని చుక్క – అది Easy నేనా?
ఎందుకని?
సాపేక్షం’’. తెలివి రెండిటిని పోల్చి చూస్తుందన్నమాట, అదే ఇందాక నుంచి చెప్తుంది, compare & contrast.

సరే, ఇంతకు ఇంత అర్థం కాని కర్మ abstract form కదండీ! అజ్ఞానము, విజ్ఞానము ఎంత abstract forms గా వున్నాయో ఈ కర్మకూడా అంత abstract from గా కనపడుతూవుంటుంది. వేదాంత విద్యను అభ్యసించేవాళ్ళందరికీ, ఎంతసేపు దేని చుట్టూ తిరుగుతూ వుంటుంది? మన జీవితం అంతా బుద్ధిచుట్టూ, కర్మ చుట్టూనే తిరుగుతూ వుంటుంది. జీవభావం అంతాకూడా ఈ రెండు లక్షణాలతోనే ముడిపడి వుంది. దైవభావన అనేది ఈ రెండిటిని అధిగమస్తే స్థిరమైపోతుంది. వేరే ఇంకేమీ లేదు. దివ్యత్వం అనేది ఈ బుద్ధిని, ఆ కర్మని ఈ రెండిటిని అధిగమిస్తే నువ్వు దివ్యత్వమే. నువ్వు దేవుడవే’. ఈ జీవుడు జీవుడు కాడు. ఈ జీవుడే దేవుడౌతాడు. కొత్తవాడేమీ రాడు. కానీ, ఈ రెండు పరిమితులని అధిగమించడం నేర్పడమే వేదాంతం అంతా. అన్ని సాధనల యొక్క రహస్యం కూడా ఇదే.  ఏంటయ్యా అంటే? కేవలం ఈ బుద్ధి యొక్క పరిమితిని, ఆ కర్మ యొక్క పరిమితిని దాటడం. అధిగమించిన స్థితిలో వుండి నెరవేర్చడం. దాటటం అంటే బాగా గుర్తుపెట్టకోండి. హనుమంతుడు ఈ చివర నుంచి ఆ చివరకి లంఘించాడు. అంతేనా కాదా? అండీ! మహేంద్ర గిరి నుంచి, ప్రశ్రవణ గిరికి లంఘించాడు. అవతల వున్నది ప్రశ్రవణగిరి, ఇవతల వున్నది మహేంద్ర గిరి.
ఇక్కడి నుంచి అక్కడికి లంఘించాడు. అంతేనా కాదా? అంటే దాటాడు. ఇది బాగా అందరినీ చదవమంటారు. చిన్నప్పుడే చదవమంటారు. ఈ దాటడం అన్నది.
ఇప్పుడు దాటడంఅంటే ఏం చేయాలి?
సముద్రంలో మునిగాడా మునగ లేదా?
(మునగలేదు)
మునగలేదా? అవసరం వచ్చినా మునగలేదా? మధ్యలో ఎక్కడా ఆగలేదా?
ఆగాడు.
సంగత్వంఎక్కడైనా వుందా? తన లక్ష్యాన్ని ఎక్కడైనా మరచిపోయాడా?
రామకార్యమై బయలుదేరాడు. అంతేనా? ఆయన సొంతకార్యమేనా?
ఆయన ఎందుకోసం వెళ్ళాడు? లంకానగరానికి,
స్వామి కార్యం కోసం వెళ్ళాడు.

మనం కూడా జనన మరణాలు అనే మహేంద్రగిరి నుంచి ప్రశ్రవణ గిరికి వెళ్తున్నాం. ఈ రెండూ రెండు గిరులండీ. మనం కూడా ప్రాణాల సాయంతోనేనా వెళ్తున్నది? ప్రాణాలు లేకుండా వెళ్తున్నామా? ప్రాణం లేకపోతే జననం నుంచి మరణంకి వెళ్ళడానికి ఏమీ వుండదు. ఒకసారే రెండూ వస్తాయి. అర్థమైందా? జననంతో ప్రాణం మొదలయ్యింది, ఆ ప్రాణం, మరణం వరకూ ప్రాణ సహాయంతోనే వెళ్తూవున్నాం. కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాం? జననం నుంచి మరణానికి లంఘనం చేస్తున్నాం. దాటటమే చేస్తున్నాము. అయితే,
స్వామి కార్యంగా చేస్తున్నామా? స్వకార్యంగా చేస్తున్నామా?
స్వకార్యంగా చేస్తున్నాము.
అయిపోయింది. అక్కడ పోయింది. అర్థమైందా అండీ?
ఇదంతా మనం స్వామి కార్యంగా చేశామా? స్వకార్యంగా చేశామా?
కర్మ”- అక్కడ పుట్టింది.
కర్మకు పాదు ఎక్కడా అంటే?
స్వ’- అన్నచోట కర్మకు పాదు పుట్టుంది.
స్వకార్యం – ఇక్కడ అసలు నాకు తెలిసి జననం నుంచి మరణం దాకా స్వకార్యం ఒకటి చెప్పండి. Please tell one. మీదైనది ఒక్కటి చెప్పండి?

స్వామికార్యంకానిది, స్వకార్యం అయివున్నది ఒక్కటి చెప్పండి?

ప్రొద్దున లేచావ్‌, నీ చేతిలో వుండే లేస్తున్నావా?
ప్రొద్దన లేవడం నీ చేతుల్లోనే వుండి లేస్తున్నావా?
భగవంతుడు Gate తీయలేదనుకోండి, ఏమౌతావ్‌?
ఎక్కడుంటావో నీకు తెలియదు తరువాత. అంతేనా కాదా?

రాత్రికి నిద్రలోకి పోవడం నీ చేతుల్లోనే వుందా? 
అది వస్తే తప్ప నువ్వేమీ చెయ్యలేవు. అర్థమైందా అండీ!

మా శ్రీమతిగారు అడుగుతూ వుంటుంది. నువ్వు నిద్రపోవా?
అది వస్తే కదా, నేను పోవడానికి. అంతే కదా!

నిద్ర రాలేదనుకోండి, మీరేంచేస్తే నిద్ర వస్తుందండి? Please Tell.
You cannot.
సరే, మీ అంతట మీకు ఆకలి వేయడంలేదండి, ఏం చేస్తే ఆకలి వేస్తుంది?
క్షుత్పిపాసలు నీ స్వాధీనమయ్యే వున్నాయా?
ప్రాణాధీనములు అవి. నువ్వు రమ్మంటే రావు, పొమ్మంటే పోవు.
ఒకసారి ఆకలి వేసింది పో’- అంటే పోతుందా?
పోదు, దాని ధర్మం దానికి నెరవేర్చాల్సందే. అవునా కాదా?

ఇలా ప్రతీది సృష్టి ధర్మాన్ని అనుసరించే కదా! ఇందులో జరుగుతోంది.
సృష్టి ధర్మాన్ని అనుసరించనది ఇందులో ఏదైనా జరుగుతోందా?
పంచభూతాత్మకం కానిది ఏదైనా ఇందులో జరుగుతోందా?
లేదు.
పంచభూతాలను నువ్వు సృజించావా?
పంచభూత ధర్మాలను నువ్వు ఏర్పాటు చేశావా?
మరిప్పుడు స్వామికార్యంకాని స్వకార్యం ఒక్కటి చెప్పండి?
పరిమితమైనటువంటి దృష్టితో, పరిమితమైనటువంటి భావనతో నేనొక 100 చీరలు కొనాలనుకున్నాను. ఏం చేసుకుంటావు తరువాత? నువ్వు వెళ్ళిపోయిన తరువాత నీ 100 చీరలను ఏం చేయాలి?
మనం వున్నప్పుడేనండీ అంతా, తరువాత ఏది ఎవరికి పోవాలో
ఇప్పుడే ధోరణిలో చెప్పావ్‌? అయిపోయే. చూడండి. అంటే నీ వ్యావహారిక మైనటువంటి స్థితిలో, ఎక్కడైనా ఎదురు ప్రశ్న వేస్తే, ఎటుపోతున్నావ్‌? అటు పోవల్సిందే తప్పదు వేరే మార్గం లేదు. తత్త్వజ్ఞానంలో answer చెప్పకుండా దానికి answer లేదు. అవునా కాదా? కాబట్టి మన నిజ జీవితంలో మనం చేస్తున్నదంతా స్వామి కార్యం అనుకోవడంలోనే రహస్యం వుంది అంతా.
నువ్వు ఎప్పుడైతే స్వామి కార్యంఅనుకున్నావో, అప్పుడు తామసిక శ్రద్ధతో చేసే అవకాశం వుందా?
మనం తామసిక శ్రద్ధతో ఒకపని చేస్తాం, ఏమిటది చెప్పండి?
టక్ మని answer చెప్పాలి, నిద్ర.
లేవగానే మీ మొహం చూసుకున్నారా? ఎప్పుడన్నా? Without any time లేస్తూనే చూడగలగాలి. కావాలంటే అద్దం ప్రక్కన పెట్టుకుని పడుకోండి. లేవగానే చూసుకోండి. చూస్తే మీ ఫేస్‌ మీకు ఎలా కనబడుతుంది? రాత్రి నిద్రావస్ధలో మీరు పొందిన అనుభవాల తాలూకూ విశేషణాలన్నీ మీ మొహంలో readings కనబడుతాయి. ఓహో! కలలో ఇంత భీకర యుద్ధం జరిగిందా అని మనకు తెలుస్తుంది అప్పుడు. మనం నిజంగా చేస్తుంది మెలకువలో మనమేదో పోరాడుతున్నామని అనుకుంటున్నామండీ, ఇంతకు 1000 రెట్లు కలలో పోరాడుతోంది.
ఎవరు? బుద్ధి. ఆ కలలో అంతాకూడా వుంచాలా? తీసేయాలా? ఉంచాలా ? తీసేయ్యాలా? అవసరమా? కాదా? Accepted? (Or) Rejected? గొడవ జరుగుతా వుంటుంది అక్కడ. అందులో మనమేమి చేస్తాం? విజ్ఞానయుతమై అధిగమించినటు వంటి అంశాలన్నీ okay, no problem, okay, no problem. “Okay, no problem” అన్నవన్నీ ఏమౌతాయి? Prints పడవప్పుడు. స్మృతిలో గట్టిగా పడవు. అవి సాధించబడి పోయినాయి. అర్థమైందా? ఇహ, దాని మీద పెద్దగా నువ్వు దృష్టి పెట్టవలసిన అగత్యము లేదు. Accepted. Okay no problem. అప్పుడేమైపోయింది? కలసులభమై పోతుంది. ఆ పోరాటం అణిగిపోతుంది. అంత వుండదన్నమాట అప్పుడు. మెలకువలో ఈ మూడు మీరు తరచుగా వాడటంలేదన్నమాట. ఏమౌతుంది? ఇప్పుడేం చెప్పాను? Okay, No Problem, Accepted – ఈ మూడు అనడానికి ఏమన్నా కష్టం వుందా? ఈ మూడు అనడానికి ఏమన్నా కష్టం వుందా? చూడండి! భగవంతుడి దగ్గర, గురువు దగ్గర ఇది స్వామికార్యంఅని ఒప్పేసుకున్న తరువాత, హనుమంతునికి ఎవరైనా ముందు చెప్పారా? ఏమయ్యా! మధ్యలో నీకు మైనాకుడు వస్తాడు. మధ్యలో సరస్సు వస్తుంది. మధ్యలో odd test వస్తుంది. మధ్యలో సింహిక వస్తుంది. ఆ తరువాత లంకిణి వస్తుంది. ఇవన్నీ ఎవరన్నా చెప్పారా? చెప్పలేదే? రాముడేమన్నా చెప్పిపంపించాడా ఇవన్నీ? చెప్పలేదే. మనకు మనం మాత్రం ఏం అడుగుతున్నాం? గురువుగారి దగ్గరకు వచ్చి? కొద్దిగా నేను ఎలా వెళ్తానో? ఏమౌతానో కొద్దిగా చెప్తారు? ఏమిటి చెప్పేది? అంటే మొట్టమొదట మనం ఏ నిర్ణయానికి రావాలి? ఈశ్వరుడి దగ్గరైనా? గురువు దగ్గరైనా? అరె, జీవితాన్ని స్వామికార్యంగా మార్చుకో!జీవితమే స్వామికార్యమనే దృష్టితో చూస్తే, దైనందిన జీవితం, మెలకువ, కల, నిద్ర సమస్తము స్వామి కార్యమే. అప్పుడు స్వ- లేదుగా. You removed your Self. వివేకానందుడు అంటాడు, దేవుడిని ఆరాధించడం అనే భక్తి ద్వారా నేనేమీ పొందలేదు. ఒప్పుకుంటారా? మీరంతా. భగవంతుని ఆరాధించడం ద్వారా నేనేమీ పొందలేదు అంటాడాయన. ఈయన statement మీరు ఒప్పుకుంటారా? Yes, accept చేయవలసిందే. ఎందుకనిట? But I lost many. నేనేం పొందలేదు, కానీ చాలా పోగొట్టుకున్నాను. భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా, ఆరాధించడం ద్వారా, భక్తి ద్వారా నాలో వున్నటువంటి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలన్నింటినీ పోగొట్టు -కున్నాను. కాబట్టి ఇప్పడు మనం భగవంతుడుని ఆరాధిస్తున్నది పొందడానికా? పోగొట్టుకోవడానికా? హనుమంతుడు రాముడికి సర్వార్పణ అయినటువంటి వాడు కాబట్టి తన జీవితం మొత్తాన్ని ఏం చేశాడు? స్వామికార్యంగా జీవించాడు. మనం మాత్రం ఎలా జీవిస్తున్నాం? హనుమంతునికి మాత్రం సువర్చలతో కల్యాణం చేయడానికి మాత్రం సిద్ధపడిపోతాం. ప్రయోజనమేమి వున్నది? ఆకుపూజలు చేయడం, గారెల దండలు వేయడం అంతేనా? లేదంటే అప్పాలు దండలు వేయడం. ఇదా మనం అందులోంచి నేర్చుకోవలసిన సత్యం? కాబట్టి ఈ బుద్ధి అనే పరిమితిని, ‘కర్మ అనే పరిమితిని దాటడానికి ఉపాయాలు. కానీ, ఈ ఉపాయాన్ని మూఢత్వంతో వాడుతున్నాం. అప్పుడేమైంది? మన మూఢత్వానికి భగవంతుణ్ణి బాధ్యుడిని చేశామండీ! ప్రయోజనమేమన్నా వుందా? పైగా మీరలా చేసి, మీ తర్వాత తరాలని కూడా ఎలా చేయమంటున్నారు. Same you should follow, ఆ తరం వాళ్ళేమంటారప్పడు they will ask you why?

తర్వాతి తరాన్ని answer చేసే శక్తి లేదు మీ దగ్గర. ఎందుకని? మీరెవరు ఆ దశగా విచారణ చేయలేదు. వాళ్ళు open mind తోటి వున్నారు. వాళ్ళకి వాళ్ళమీదేమీ బరువూ బాధ్యతలు వుండవు కదా! పిల్లలు కదా! సహజమైన స్థితిలో వుండి ఇది ఎందుకు చేయాలి? దీని వలన వచ్చే ప్రయోజనమేమిటి? దీని వలన వచ్చే విజ్ఞానమేమిటో చెప్తే చేస్తా, లేకపోతే చేయను. మీరేమంటారు? చేస్తే వస్తుంది అంటారు. అంతేకదా! మీ answer. చేస్తే వస్తుంది అంటే, అన్నిటికీ ఆ answer సరిపోతుందా? చాలదు. మరి మనం 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి బాగా చేస్తూనే వున్నాంగా. ఏమిటి వచ్చింది? వెనక్కు తిరిగి చూస్తే? కేవలం నిన్ను నువ్వు పోగొట్టుకోవడంఅన్న పనే పూర్తి అవ్వలేదు. మరెలా? కాబట్టి
నిన్ను నీవు పోగొట్టుకునే పనిలో పడాలట. అది భక్తి అంటే.
నేను వేరుగా వున్నానుఅన్న భావన చేత నువ్వు ఈశ్వరుడిని ఆశ్రయిస్తున్నావు. నేను వేరుగా లేను అన్న స్థితికి ఎదగాలి. అంతేనా కాదా? అప్పుడు మాత్రమే భక్తి సాధ్యమౌతుంది. లేకపోతే సాధ్యపడదు.
భక్తిఅనే పరిమితి లోపల వున్నప్పుడు, నీకు స్వకార్యంవుంటుందా? అవకాశమే లేదు. అన్నీ స్వామికార్యములే భక్తుడికి, స్వకార్యములు లేవు. కాబట్టి ఇప్పడు మనం అందరం భక్తులు అనే category లోకైనా వస్తున్నామా?  ఇందాక ఏమని ఒప్పుకున్నాం? మన జీవితం అంతా స్వకార్యములే కనపడుతున్నాయి తప్ప స్వామి కార్యములు కనబడటం లేదు అన్నామా లేదా? అనంగానే ఏ పరిధిలోకి పడిపోయావ్‌? భక్తుడివి కూడా కావు. కనీసం భక్తుడవైతే ఏం ఒప్పుకోవాలి? హనుమంతుని వలె – అన్నీ స్వామికార్యములేనయ్యా! నా కార్యము ఏదీ లేదు. స్వామి కార్యం అని చెప్పడం వల్ల నీలో ఆత్యంతిక శ్రద్ధ ఏర్పడుతుంది. ఎందుకనిట? మీ ఇంట్లో పూజా మందిరానికి, మీరు వెళ్ళాలి అనుకోండి, బయట నుంచి చెప్పులేసుకుని వచ్చారు. సరాసరి అవే చెప్పులు, షూ తోటి మీ పూజామందిరంలోకి వెళ్తారా? వెళ్ళరా? ఏ? దేవుడికి చెప్పులికి ఏమన్నా fighting వుందా? (ఇంట్లోకే వెళ్ళరట ఆవెడ). ఎందుకని? Why? ఎందుకనండీ? చెప్పులు పనికిరానివా? చెప్పులసలు పనికిరావా మనకి? పనికొస్తాయా? పనికిరావా? Use less హా? Very use full బయటకు వెళ్తే అవే కావాలి. మరెట్లా? ఇప్పడు మన దేహం కూడ, ఈ జీవభావం కూడా ఆ చెప్పులు లాంటిదే. దీనిని పట్టుకుని అక్కడకు వెళ్ళడం కుదరదు. అర్థమైందా అండీ? దీన్ని ఎక్కడో ఒకచోట వదిలెయ్యాలి. దీన్ని వదిలేస్తే మీరు లోపలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈశ్వరాయత్త చిత్తమును పొందాలి మనము. ఈ స్థితికి రావాలంటే ఏం చేయాలి? మీ ఇంటి ముందుకు వచ్చారండీ, మీ ఇంటి ముందుకు రాగానే మీకు ఎవరు కనబడుతున్నారు? రోజూ ఉదయం చేసే మీ పూజా పాఠం, ఆ మందిర భావన, ఆ పవిత్రభావన మీలో తోస్తోంది, తోచగానే ఏం చేశావ్‌? టక్ మని చెప్పులు బయట పడిపోయినాయి. పడిపోయినాయా? పడిపోలేదా?
            మరి మనలో కూడా స్వామికార్యంఅన్న భావన కలగగానే స్వకార్యమున జీవభావం ఏమైపోయింది? ఈ చెప్పుల వలె బయటకు పోయింది. చెప్పులు అవసరం లేదా? మరలా నువ్వు దేహంతో పనిచేయాలంటే ఆ చెప్పులే కావాలి. కాబట్టి ఇప్పుడీ దేహం దేనితో సమానం? నీ ఇంద్రియ సమూహం అంతా దేనితో సమానం? నీ చెప్పులతో సమానం. దీన్ని అలా చూస్తున్నామా? దీనికున్న విలువకంటే ఎక్కడో వైపరీత్యాన్ని జోడించాం. అందువల్ల దేనిచేత బాధించబడుతున్నాం? అంటున్నాం. అంతా నా కర్మఅండీ!” అంటుటాం ఏదైనా వచ్చినప్పుడు. అప్పుడే తోచిందా? ఇంకెప్పుడూ తోచలేదా? కానీ, బుద్ధి కర్మాను సారిణిఅన్న సూత్రంలో బుద్ధి కర్మ, అకర్మ, వికర్మ, సుకర్మ, కుకర్మ కర్మలో అన్ని లక్షణాలున్నాయి. ఎన్ని వున్నాయండీ? కుకర్మ, సుకర్మ ఇవి మీకు బాగా తెలుసు అందుకనే ఈ మొదటి రెండూ ఎవరూ చెప్పరు. మిగిలిన మూడే చెప్తారు. అకర్మ, వికర్మ చెప్తారు.
కుకర్మ అంటే ఏమిటి?
చెయ్యకూడనిది, ఆలోచించకూడనిది, అధర్మమైనది అలోచించుట, చేయుట. అర్థమైందా? అండీ! ఏం చేస్తున్నాం, ఇందాకే చెప్పా,
మన జీవితం అంతా ఏమిటి?
స్వామికార్యం.
కానీ, ఇప్పటి వరకూ ఎలా చేశాం?
స్వకార్యం.
అప్పుడిది ఏమైంది?
కుకర్మఅయిపోయింది,
అహం వచ్చి కూర్చున్నప్పుడల్లా ఏమయ్యావ్‌?
నువ్వు ఆత్మ స్వరూపుడవు అనే జ్ఞానంలోనుంచి బయిటపడిపోయావ్‌. కర్మ ప్రభావితంలోకి వచ్చేశావ్‌. బుద్ధి ప్రభావితంలోకి వచ్చేశావ్‌. అర్థమైందా? మనోపరిధిలోకి దిగిపోయావ్‌. విషయాల్లోకి దిగిపోయావ్‌.
అప్పుడు సంగత్వ దోషం వచ్చిందా? రాలేదా?
అంటుకున్నాయా? లేదా? ఇవన్నీ.
ఇవన్నీ అంటుకునేటప్పటికీ నీకు బరువైందా? అవ్వలేదా?
బరువవ్వగానే వాటితో పోరాడాలా? వద్దా?
నీ కలలో అంతే వీటితో పోరాడుతున్నావా? లేదా?
పోరాడి పోరాడి అలసిపోయి ఆ చీకటి అనే బావిలోకి పడిపోతున్నావ్‌.
ఏమిటా చీకటనే బావి?
నిద్ర.
ఇది రోజు నిద్రలో పడిపోతున్న విధానం మనం.
పగలంతానేమో స్వకార్యము, నాపని, నాపని, నాది, నాది, నేను, నాది, నేను అనే కుకర్మ చేత బాధించబడి, జీవభావం చేత బాధించబడి, శరీరమే నేనుగా జీవించి, అహం బలపడి, సంగత్వదోషం బాగా బలపడి, స్మృతులు బాగా బలపడి, సుఖదుఃఖాలు బలపడి, ఏవైతే కూడదో అవన్నీ బలపడి, ఏవైతే స్వరూపజ్ఞాన విశేషానికి వ్యతిరేకమో అవన్నీ బలపడేట్లు మెలకువలో జీవించావు. జీవిస్తే కలలోకి వెళ్ళగానే ఏమైనాయి? ఇవిలేవుగా అక్కడ. వీటితో పాటు అవతలకి వెళ్ళడానికి అది ఒప్పుకోదు. ఈ బరువంతా మోసుకుని నేను అవతలికి వెళ్తానంటే కుదరదంటుంది, అప్పుడేమి చేయాలి? కాస్తంత బరువు తగ్గించుకో. ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళారు మీరు 22.5 కిలోలు తీసుకువెళ్ళాలి. చెక్‌ఇన్‌లోకి వెళ్తావ్‌. ఏంచేస్తాడు అప్పుడు వాడు? బాబు నాలుగు కిలోలు ఎక్కువ వేశావ్‌ అవతల పారేయ్‌ అంటాడా? లేదా? మనం కూడా కలలోకి వెళ్ళినప్పుడు ఇంతే జరుగుతుంది. బాగా మెలకువ నుంచి ఎక్కువ బరువు మోసుకొచ్చావ్‌. దించేసేయ్‌ మంటుంది. టక టక టక దించేస్తావ్‌ కలలో. అప్పుడు మాత్రమే ఆ తేలికైనటువంటి స్థితిలోనే ఆ పోరాటంలో అలసిపోతావ్‌ అన్నమాట. బుద్ధి ఈ స్థితిలో కలలో అలసిపోతుందండి. అలసిపోయి ఆ తరువాత నున్న చీకటి దిగుడు బావిలో పడిపోతుంది. ఇలా నిద్రలో పడిపోతావ్‌.

ఈ అలసట లేకపోతే నిద్రరాదా?
ఆ, అందుకనే ఉపవాసం వుండమన్నారు. జాగరణ వుండమన్నారు. ఎప్పుడైనా జీవితంలో నిజ ఉపవాసం, నిజ జాగరణ చేసి వుంటే, ఈ అనుభవం సులభంగా తెలిసిపోతుంది. అందుకే మహాశివరాత్రి, తొలిఏకాదశి ఇలాంటివి పెట్టారన్నమాట. పగలంతా నీవు నేనుఅన్న భావన తోచకుండా, నీ స్వకార్యం అన్న భావన తోచకుండా, ఆత్యంతిక శ్రద్ధతో, కేవల భక్తి భావం మీద మనసు నిలిపి, నామస్మరణో, జపమో, తపమో, ఆంతరిక జపమో ఈ రకమైనటు వంటి నిన్ను తేలిక పరిచేటటువంటి, నీ బరువు పెంచకుండా వుండేటటువంటి, భౌతిక కార్యక్రమాలు లేకుండా, వ్యావహారిక మైనటువంటి ఆవేశకావేశాలకు చోటివ్వకుండా, ఫలితం మీద ఆసక్తి లేకుండా ఇలా ఎప్పుడైతే నువ్వు రోజంతా వున్నావో ఆ రోజు ఏమైపోయావ్‌? చూడండి మీరు. ఆ రోజు రాత్రి కలలో మీకు ఏమీ పెద్ద ప్రమాదాలు రావు. ఏం పెద్ద పోరాటమేమీ వుండదు. చాలా relaxed గా వుంటారు. ఇంకా ఎంత relaxed గా వుంటారయ్యా అంటే? ఏం కలలు వచ్చినాయో కూడా మీకు తెలిసే వస్తాయి ఆ రోజున. మామూలు రోజుల్లో తెలియవండీ, మామూలు రోజుల్లో పోరాడేటప్పుడు, ఎదురుగుండా తీవ్రమైన అంశాలు వున్నప్పుడు పోరాటంలో నిమగ్నమైపోతావు. సాక్షినిలబడి వుండడు. ఎప్పుడైతే సులభమైన పద్ధతిగా నువ్వు జీవిస్తావో, అప్పుడేమైపోతుంది? బరువు తగ్గిపోతుంది. నీ కల తేలికైపోతుంది. ఒకటో, రెండో అలా నిన్ను స్పృశించి, స్పృశించకుండా పోతాయి. అవి ఎక్కడున్నవయ్యా? అంటే అంతరంతరాలలో వున్నటు వంటివి. అవి భౌతికమైన మెలకువలకు సంబంధించినవి కావు. అలాంటివి అలా స్పృశించి పోతాయి.
మనం చేసేటటువంటి పనులలో అతి తీవ్రమైనవి, మందమైనవి, మధ్యస్థమైనవి, తేలికైనవి రకరకాలు వుంటాయి. పుణ్యపాపాలు రెండిటి లోనూ వుంటాయండి.
అతి తీవ్రమైనటువంటివి అన్నింటినీ కూడా ఆచరించే వదల్చుకోవాలి వేరే మార్గం లేదు. అక్కడ వచ్చింది ఈ కర్మ సిద్ధాంతం”. లేకపోతే అది రావలసిన అవసరం లేదు.
మధ్యస్థమైనవి, తేలికైనవి – మధ్యస్థమైనటువంటి వాటిని సూక్ష్మంగా పరిష్కరించవచ్చు. అంటే కల పరిష్కరించేస్తుంది. బాగా తేలికైనటు వంటి వాటిని స్వరూపజ్ఞానంతో పరిష్కరించవచ్చు. వాళ్ళు ఆచరించనక్కర్లేదు. అందుకే జీవన్ముక్తునికి కర్తవ్యకర్మాచరణ లేదు అని శాస్త్రం ఖండితంగా చెప్పింది. ఎందుకనిట? ఎవరైతే ఈ ఆత్మానుభూతిని పొందారో, ఎవరైతే ఈ బ్రహ్మానుభూతిని పొందారో, వాడు ఏ బరువు తగ్గించుకున్నాడిప్పుడు? వాడికి అత్యంత తీవ్ర పాపము లేదు, అత్యంత తీవ్ర పుణ్యము లేదు. మధ్యస్థ పాపము లేదు, మధ్యస్థ పుణ్యము లేదు. ఒక వేళ శరీరధారియై వున్నందువల్ల, ఆ శరీరం నిలబడడానికి అవసరమైనటు వంటి, అతి తేలికైన, అతి సూక్ష్మమైన, జన్మకృత వాసనా బలం, పూర్వజన్మకృత వాసనా బలం కొద్దిపాటి ఏమైనా వుంటే, దాని చేత మాత్రమే అతను స్పృశించబడిబడకుండా వుంటాడు. దానిచేత అతను ప్రభావితం కాడు. కాబట్టి, స్వరూపజ్ఞానస్థితిలో నిలబడాలనుకున్న ప్రతీ ఒక్కరూ, వారి వారి నిజ జీవితంలో, వారు ఈ పుణ్యపాపముల లెక్క వేసుకోవలసిన అవసరము వుంది.
పుణ్య పాపములు అంటే ఏమిటి?
పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం”. అర్థశ్లోకంలో చెప్పాను పో! అన్నాడాయన వేదవ్యాసుడు. నువ్వు చాలా చెప్పావయ్యా, ఇంత ఎవడు చదువుతాడయ్యా? అంటే, సరే పో! అర్థ శ్లోకంలోనే చెప్తాను – పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం. నీకు ఇచ్చినటువంటి ఇంద్రియ సమూహం చేత, అవి ఏవైనా కావచ్చు. వాటి చేత ఇతరులను విమర్శించడం, బాధించడం – పరపీడనం అంటే ఏదో చెరుపు కలిగించడం అని మాత్రమే అనుకోమాకండి, మీరొకరిని విమర్శించాలి అంటే వాడిలో వున్న గుణ, దోషాలని విమర్శించాలి. విమర్శించాలా వద్దా? ఎప్పుడైతే అది చూశావో, సహజంగా మీకు పరపీడన పరాయణత్వం వచ్చేస్తుంది. మీ ఖాతాలో వేసేస్తారు. వెయ్యడం అంటే ఏమీ లేదు, నీ లోపల ఆ జ్ఞానబలం, స్మృతి బలం పెరిగిపోతూ వుంటుంది. ఆ స్మృతి బలం పెరిగిపోతే, ఆ స్మృతిని అనుసరించే నీ బుద్ధి పనిచేస్తుంది. ఆ జ్ఞాపకాల బలంలోనుంచి బయటకు వచ్చి అదేమీ పని చెయ్యదు.  అయితే, ఇవ్వన్నీ పని చేయించనివ్వకుండా వుండేటటువంటి సాధనాబలం మనదగ్గర వుండాలి. మనిషి ప్రతి ఒక్కడూ సాధకుడయ్యే అవకాశం వుంది. ఆ సాధనాచతుష్టయ సంపత్తిని కనుక నువ్వు సంపాదించినప్పుడు,
అవి దేనికి training సాధనాచతుష్టయ సంపత్తి?
నీ బుద్ధికి training.
నీ బుద్ధి ఇప్పుడు ఆ సాధనాచతుష్ట సంపత్తి వల్ల, బుద్ధిగ్రాహ్యమతీంద్రియం”. ఇంద్రియాల అవతల వుండేటటువంటి చైతన్యాన్ని గ్రహించేటటువంటి స్థితికి బుద్ధి మారుతుంది. అదే ఈ సాధనాచతుష్టయసంపత్తి లేదు, అప్పుడేమి చేస్తావ్‌? ఏది నిత్యమో? ఏది అనిత్యమో? వివేకంలేదు. వివేకం లేకపోతే బుద్ధి ఎప్పుడూ దేనిని కోరుతుంది? అనిత్యాన్నే కోరుతుంది. ఎందుకనిట? అది ready made సుఖం. కష్టపడాల్సిన పనిలేదు. అర్థమైందా? అండీ! మీరు వండుకోవడం సులభమా? Curry point కి వెళ్ళి తెచ్చుకోవడం సులభమా? సందు సందుకీ curry point లు వచ్చేసినాయి అందుకే.  అవునాకాదా? Curry తో పాటు మనమేమి తెచ్చుకోవాలి? జింటాక్‌బిల్లలు కూడా తెచ్చుకోవాలి. గ్యాస్ట్రో ఎన్ట్రిక్‌ problem కూడా దాంతోపాటే వస్తుంది. మనం వండుకున్నంత కాలంలో ఎవరైనా గ్యాస్ట్రో ఎన్ట్రిక్‌ ప్రాబ్లంతో బాధ పడ్డారా? మీ తాతల తరంలో, మీ తండ్రుల తరంలో, మీ ముత్తాతల తరంలో మనభారత దేశంలో గ్యాస్ట్రో ఎన్ట్రిక్‌ ప్రాబ్లమ్స్‌ వున్నాయా? ఎవరికీ లేవు. ఇవాళ గ్యాస్ట్రో ఎన్ట్రిక్‌ ప్రాబ్లం లేని వాళ్ళు వున్నారా? Nobody. కేవలం జీవన వ్యవహార, ఆహార వ్యవహారముల వలనే ఈ మార్పు వచ్చిందండి. నిరంతరాయం ఏదో ఒక సమస్య వస్తుంది దాని వల్ల. ఎందుకని? ప్రాణాపానములు సరిగా జరుగనివ్వదు అది. అపసవ్యదిశలో జరుపుతుందండి. ఈ గ్యాస్ట్రో ఎన్ట్రిక్‌ ప్రాబ్లం అంటే ఏమీ లేదు. సృష్టి ధర్మం ప్రకారం సవ్యదిశలో జరగాలిది. ఇది అపసవ్యదిశలో ఉల్టా చేస్తుందన్నమాట. అప్పుడేమైపోతారు? మీ సమస్థితిని కోల్పోతారు. ప్రాణం మీ స్వాధీనంలో వుండదు. అప్పుడు మీరు నిజజీవితంలో ఎలా చేస్తారు? పైగా దాంట్లో వున్నటు వంటి లక్షణం ఏమిటి? వ్యతిరేక పదార్థాలని బాగా ఆకర్షింపజేస్తుంది. దానికేది పడదో అదే తినాలనిపిస్తుంది. బాగా గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ వున్నవాళ్ళందరూ మిరపకాయల బజ్జీ బండీ చుట్టూరా వుంటారు. వాళ్ళకు తెలుసు అది పడదని, కానీ ఆ వ్యాధి లక్షణ ప్రభావం చేత, అపసవ్య దశలో ప్రాణం పనిచేయడం వల్ల, ఆయా పదార్థాలు, తామసిక పదార్థాలు రజోగుణ ధర్మం నుంచి తమోగుణ ధర్మానికి మారిపోతాయి. ఈ గుణధర్మం చేత మీకు పుణ్యపాపాలు ఏర్పడుతున్నాయి. నీ శరీరమును నీవే హింసించుకున్నా కూడా నీ ఖాతాలో భాగం అయిపోతుంది. ఏ పేరు చెప్పైనా సరే, నీ పరిమితి మించి ప్రయత్నం చేశావ్‌. నీ శరీరం వ్యతిరేకించింది. కుదరదు అంది. అర్థమైందా? No, నువ్వు కూర్చోవాల్సిందే. గురువుగారు చెప్పారు, రాత్రంతా మెలకువగా కూర్చోవాల్సిందే. ఏమైందప్పుడు? దానికి నీకు సంఘర్షణ వచ్చింది. ఎంతసేపు వుంటుంది? కొద్దిసేపైన తరువాత పడిపోతుంది. అవునా? కాదా? అప్పుడు కూడా నీ ఖాతాలో పాపమే. ఇప్పుడు పుణ్య పాపాలను అనుభవించేది నీవా? నీ శరీరమా? నువ్వే. ఏ జీవుడైతే వున్నాడో, వాడే అనుభవిస్తున్నాడు. శరీరం జడం కదా! దానికేం తెలుసు? దానికి నోరు, వాయ లేదు. దానికి నోరు వాయ నిజంగా భగవంతుడిచ్చుంటే మనల్నిలా వుండనిస్తుందా? అది. అర్థమైందా? కాబట్టి, మనం ఎప్పుడైతే దోషబుద్ధితో వ్యవహరిస్తామో, అప్పుడీ కర్మంతా ఏమైపోయింది? కుకర్మ”. అధర్మాచరణ అయిపోతుంది.
ఏది చేస్తే, ఏది తలిస్తే, ఏ ఆలోచన చేస్తే నీకు స్వరూపజ్ఞానం విశేషాలు తెలుస్తాయో, నీలో వున్న చైతన్యం నీకు బోధపడుతందో, ప్రవృత్తిలోనుంచి నివృత్తి స్థితిలోకి వస్తావో, అలాంటి పని చేసినప్పుడు, ఇదే కుకర్మకాస్తా సుకర్మ అయిపోతుంది. ఈ కుకర్మ కాస్తా సుకర్మ అయ్యింది. అంటే ప్రవృత్తి ధర్మంలో చేసేది అంతా కూడా కుకుర్మయే. అధర్మాచరణే.
ప్రవృత్తి నుంచి నివృత్తి ధర్మంలోకి, సత్వగుణ ధర్మంగా మారినప్పుడు మాత్రమే, నువ్వు నివృత్తి మార్గంలోనికి వస్తావు. అప్పుడు మాత్రమే ఇది కాస్తా ఏమైంది? సుకర్మ అయ్యింది. ఈ సత్వ గుణాచరణ చేత, సాత్విక ధర్మం చేత, నీ బుద్ధి ప్రభావితం అయివున్నప్పుడు నీ బుద్ధికి మూడు లక్షణాలు వస్తాయి. ఏమిటవి? బుద్ధి ఇందాక రెండు దోషాలు కలిగి వుంటుంది అని చెప్పాను. ఏమిటవి? అగ్రహణం, అన్యథాగ్రహణం. ఇవి రెండు దోషాలు పోవాలి అంటే, మూడు లక్షణాలు సంపాదించాలి ప్రతి సాధకుడు కూడా. అది సాత్విక బుద్ధిచేత మాత్రమే సాధ్యమౌతుంది. ఆ మూడు లక్ష ణాలు రాలేదంటే, బుద్ధిలో రజోగుణ, తమోగుణ సంబంధమైన విశేషణాలు, ఆచరణ, వ్యవహారము వున్నాయని ఖాయంగా నిరూపించబడింది. ఆ మూడు లక్షణాలు ఏమిటంటే,
1.       సునిశితత్వము
2.    సూక్ష్మత్వము
3.    తీక్షణత్వము
బుద్ధికి మూడు లక్షణాలు వుండాలి. ఏమిటవి? సునిశితత్వము, సూక్ష్మత్వము, తీక్షణత్వము. ఈ మూడు లక్షణాలతో పనిచేయాలి. ఇది సాత్వికబుద్ధి అయితేనే పనిచేస్తుంది. రాజసిక, తామసిక లక్షణాలతో కూడిన బుద్ధి ఇందులో పనిచేయదు. ఈ మూడు లక్షణాలు దానికి వుండవు. ఉదాహరణ చెప్తాను మీకు.
విలు విద్య నేర్పాలి అంటే, ద్రోణాచార్యులు గారు ఏంచేశారు? అర్జునుడిని పిలిచాడు. నీకేం కనపడుతుందయ్యా అంటే? ఆయనేదో చెప్పాడు. మిగిలిన వాళ్ళందరినీ అడిగినప్పుడు వాళ్ళేం చెప్పారు? భీముడిని పిలిచాడు అనుకోండి? ఏం చెప్పాడాయన? ఓహ్‌! చెట్టంతా కనపడుతుంది నాకు, నువ్వు పనికిరావు పో! అన్నాడు. ఎందకనిట? విలువిద్యని నేర్చుకోవాలంటే ఆ విలువిద్యని వినియోగించాలన్నా విద్య నేర్చుకోవాలన్నా ఏం కావాలి? పక్షి అంతా కనపడుతుందన్నా పనికిరాడు వాడు. ఏ లక్ష్యం కొట్టాలో, ఆ లక్ష్యమే కనపడాలి. ఇప్పుడు ఆ విలువిద్యకు కావల్సిన లక్షణాలు ఏమిటి? సూక్ష్మత్వము, సునిశితత్వము, తీక్షణత్వము వుండాలా? వద్దా? ఇప్పుడు. Correct గా పక్షి కనుగుడ్డు మాత్రమే చూడగలిగేటటువంటి లక్షణం వుండాలి. పొద్దున కూడా చెప్పా మీకు, అనేక వాక్యాలుంటాయి శాస్త్రంలోనూ, బోధలోనూ. సాధన వాక్యం ఏదో పట్టుకోగలిగినవాడే సాధకుడు అవుతాడు. ఆప్తవాక్యాన్ని పట్టుకున్నావ్‌ - ఉన్నచోటే వుంటావ్‌. కాకపోతే కాసేపు తాత్కాలిక ఉపశాంతి. బోధావాక్యాన్ని పట్టుకున్నావ్‌ - మననం చేయడానికి పనికొస్తుంది. శ్రవణం చేయడానికి పనికొస్తుంది. అంతేకానీ ఆచరణకు చాలదు. మారడన్నమాట వాడు ఎప్పటికీ. మనలో ఎప్పటికీ మారనివాళ్ళు ఎవరైనా వుంటే, వాళ్ళు తెలుసుకోవాల్సిన సత్యమిదే, నిజజీవితంలో వాళ్ళు రజోగుణ తామసికమైనటువంటి కర్తవ్యకర్మాచరణలో, ఆ రెండుగుణాలతో తాదాత్మ్యత చెంది ఎప్పుడైతే జీవిస్తావో, ఈ మూడు లక్షణాలు ఎప్పటికీ రావు. ఈ మూడు లక్షణాలు రాకపోతే, బుద్ధి ఎప్పటికీ చైతన్యవస్తువుని గ్రహింపజాలదు. కర్మపరిధిని అతిక్రమింపజాలదు. ఎందుకనిట?
బుద్ధి కంటే కర్మ సూక్ష్మమైనది. ఎందుకని?
సూక్ష్మం ఎప్పుడూ leader. స్థూలం Follower. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? సూక్ష్మం leader, స్థూలం follower. ఒప్పుకుంటారా? లేదా?
ఎలా? నిరూపించండి చూద్దాం. 

కన్నుని కాలు follow అవ్వాలా? కాలుని కన్ను follow అవ్వాలా? As simple as it. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని follow అవ్వాలా?

జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని follow అవ్వాలా? Simple గా తేల్చుకోవచ్చు. దానికేం బుర్రబద్దలుకొట్టుకోవక్కర్లేదు.
కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు - అంతరేంద్రియాలని follow అవ్వాలా?        అంతరేంద్రియాలు వీటిని follow అవ్వాలా?
కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు స్థూలం. అంతరింద్రియాలు సూక్ష్మం కాబట్టి, సూక్ష్మం ఎప్పడూ leader.  స్థూలం ఎప్పుడూ follower. ‘కర్మ అనేదిబుద్ధి కంటే సూక్ష్మం. ఇప్పుడు కర్మ’- leader. ‘బుద్ధి’ – follower.
సూక్ష్మాన్ని తెలుసుకోవాలండి! మనం స్థూలంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అవుతుందా పని? ఏమండీ? రోజూ మీరు కూరగాయలు తరుగుతారా? తరగరా? కత్తి వుంటుందా లేదా? ఆ కత్తితోటి కంట్లో Operation చేసేద్దామంటే? కుదరదా? కత్తి వేరే కావాలా? కత్తి ఏదైనా కత్తే కదా? పనికిరాదా? సరే, రోజూ మీరు కూరలు తరుగుతున్నారు కదా! కాసేపు మీకే సిజేరియన్‌ ఆపరేషన్‌చేసే పని ఇచ్చేద్దాం. ఏమౌతుంది? ఎందుకనిట? ఇది స్థూలం. అది సూక్ష్మం.

జ్ఞానంఎప్పుడూ సూక్ష్మం. సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమం. సూక్ష్మంలో కూడా మళ్ళా మూడు స్థాయిలు. సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమం. మరింత Operation చేయాలంటే, చేతికి ఆపరేషన్‌ చేయడం సులభమా? బ్రయిన్‌లో Operation చేయడం సులభమా? [చేతికి ఆపరేషన్‌ చేయడం సులభం]. అంతేనా? ఒప్పుకుంటారా? అట్లా ఎక్కడికక్కడ ఏమైపోతంది ఇప్పుడు? నువ్వెప్పుడు జ్ఞానం దిశగా అడుగులేస్తున్నావంటే, అభివృద్ధి చెందుతున్నావంటే, నువ్వు ఎంతసేపు నీ బుద్ధిని ఎటు పరిణామం చెందిస్తున్నావ్‌ ఇప్పుడు? సూక్ష్మంగా పరిణామం చెందిస్తున్నావు. కాబట్టి, బుద్ధికి ఇప్పుడు ఏ ఏ లక్షణం వచ్చి తీరుతుంది దాని వల్ల? సూక్ష్మం అనే లక్షణం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా కళ్ళు పెళ్ళుగా వుండి, అవిటు విసిరేసి, ఇవటు విసిరేసే డాక్టర్లు కనపడుతారా? వుంటారా? అట్లాగా? (వుండరు). ఎందుకని? ‌He cannot work like that. అంతేనా కాదా? చాలా perfect గా,  planned గా ఏనరం ఎక్కడుందో, ఏది ఎక్కడ cut చేయాలో, ఏది ఎక్కడ joint చేయాలో, అంత స్పష్టంగా తెలిసుంటేనే, ఆయన యొక్క వృత్తి జరుగుతుంది. అవునా కాదా? కాబట్టి, ఎంతగా మనం మనలోపలికి అధ్యయనం చేస్తూ పోయాం, తద్వారా మీరు ఏమౌతున్నారు? ప్రవృత్తితో బయటకు వచ్చాం. అప్పుడేమయ్యావ్‌? స్థూలమయ్యావ్‌. నివృత్తితో లోపలికి వెళ్ళాం. అప్పుడేమయ్యావ్‌? సూక్ష్మం అయ్యావ్‌. అర్థమైందా అండీ!
ఎందుకు నివృత్తి మార్గం అని అంటున్నామ్‌? ఈ సూక్ష్మమైన ధర్మానికి మనం మారుతూ వెళ్ళాలి. ఇప్పుడీ మారుతూ వెళ్ళడం కూడా కర్మేనా? కాదా? కర్మయేనా కాదా?
కర్మలో చేస్తున్నవాడు ఎవడు? నివృత్తి మార్గంలో విచారణ చేస్తున్నవాడు ఎవడు? విచారణ చేస్తున్నవాడు ఎవడు? నేను- అనటం నేర్చుకోండి. ఆత్మవిచారణలోకి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఎవరు అన్న ప్రశ్న వేసినప్పుడు నేను అన్న సమాధానం మీకు వచ్చినప్పుడు సరియైన విచారణ చేస్తున్నట్లు. లేకపోతే పుస్తకాన్ని ఆశ్రయించి విచారణ చేస్తున్నట్లు లెక్క. గుర్తు పెట్టుకోండి. నేను అన్న answer ఇప్పుడు ఎవరికైతే రాలేదో, మీరందరూ దేనిని బట్టి విచారణ చేస్తున్నారు? పుస్తకాన్ని బట్టి విచారణ చేస్తున్నారంతే. మీ జీవితాన్ని విచారణ చేయడంలేదు. అర్థమైందా అండీ! ప్రవృత్తి, నివృత్తి నీకా పుస్తకానికా? ఎవరికి వాడికే, నువ్వు ప్రవృత్తి దశలోకి బయటకు వెళితే స్థూల దశను పొందుతున్నావ్‌. నివృత్తిలోకి నీ లోపలికి విచారణ చేస్తే సూక్ష్మ స్థితిని పొందుతున్నావ్‌. అర్థమైందా అండీ! ‘బుద్ధిఅనేది ప్రవృత్తికి లోబడినప్పుడు స్థూలమైన దశని పొందుతుంది. అప్పుడు తప్పనిసరిగా కర్మఫలాన్ని ఆశ్రయించక తప్పదు. కర్మను అనుసరించక తప్పదు. కర్మను దాటాలి అంటే ఈ బుద్ధిసూక్ష్మం అవ్వాలా వద్దా? ఇప్పుడు. అయ్యితీరాలి, వేరేమార్గం లేదు. స్థూలమైనటువంటి బుద్ధితో, ప్రవృత్తికి సంబంధపడిన బుద్ధితో, ఎప్పటికీ మీరు కర్మ అనే పరిమితిని అధిగమించలేరు. కాబట్టి, నిజజీవితంలో సాత్వికమైన జీవనం కలిగివుండి, సత్వగుణాశ్రయంగా మనం జీవించి, బుద్ధికి మొట్టమొదటి లక్షణాన్ని దేన్ని నేర్పుతున్నాం? నివృత్తి మార్గంలో సూక్ష్మత. ఆ సూక్ష్మమైనటువంటి స్థితికి నేను చేరాలి. అర్థమైందా అండీ! ఈ సూక్ష్మమైన స్థితి నుంచి ఏమౌతావ్‌ next స్థితిలో? సునిశితత్వము. సునిశితత్వము అంటే, సునిశితత్వము అంటే ఏమిటి? Reading between the lines అంటాం. పుస్తకాన్ని మనం ఎలా చదవాలి? Line by line చదవాలి అంటాం. మాస్టర్లందరూ ఏం చెప్తారు? Line by line చదవాలి అంటారు. అంతేనా కాదా? గురువుగారు ఏం చెప్తారు? Between the lines చదవాలి అంటారు. Between the lines ఏముంటంది? ఏమీవుండదు. Paper వుంటుంది అక్కడ. No that’s not the intention. ఏమిటి దాని అర్థం? ఏ లక్ష్యాన్ని సూచిస్తోందో, ఆ లక్ష్యాన్ని తెలుసుకోమని Between the lines అంటే అర్థం. అర్థమైందా? కాబట్టి, ఆ సునిశితత్వము అప్పుడే వస్తుంది మనకు. Between the lines ఎప్పుడు తెలుసుకోగలుగుతావు? సూక్ష్మం కూడా దాటాలి అవతలకి. సునిశితత్వమువస్తుంది అప్పుడు నీకు. అప్పుడేమిటి కార్య కారణ వివేకం వస్తుంది. ఆ లక్షణంలో ఏమి వస్తుందండీ, సునిశితత్వం వల్ల కార్యకారణ వివేకం వస్తుంది. కళ్ళముందు కనపడేదానికి కారణమేదో, అర్థం చేసుకోగలిగే సమర్ధత వస్తుంది. అట్లా బుద్ధి క్రమేపి, ఈ రెండవ లక్షణానికి స్వాధీనమౌతుంది. ఇప్పుడు దానికి ఎన్న వచ్చినాయి? రెండు వచ్చినాయి. ఇంకేం కావాలి? తీక్షణత్వము కావాలి. అంతేనా? అంటే ఏమిటి?

తీక్షణత్వము అంటే ఏమిటి? రోజూ మీరు బీరకాయలు తరిగే కత్తిపీట ఆవకాయముక్కలు తరగడానికి వాడితే పనికిరాదా? ఏ? పదును వుండదా? చాలదా పదును? పదును రావాలంటే ఏంచేయాలి? పదును రావాలంటే ఏంచేయాలి? బాగా పదును పెట్టాలి దానికి. అంతేనా కాదా? కానీ మనం వాడే ఈ చాకులు కత్తులు దానికి పనికొస్తాయా? చిన్న మామిడికాయ తరగడానికే పనికిరాని కత్తి, అనేక జన్మార్జితమైటు వంటి వాసనాబలాన్ని, అనేక జన్మార్జితమైనటువంటి పుణ్యపాప ఫలాన్ని, అనేక జన్మార్జితమైన సుకృత దష్కృత ఫలాలను మోసుకొచ్చే జీవభావాన్ని ఖండించగలిగే సమర్ధత ఈ బుద్ధికి ఎలా వస్తుంది? తీక్షణత్వము అంటే అది. ఒక్క వేటుతో జీవభావాన్ని తుంచగలిగేటటువంటి సమర్ధత రావాలంట, బుద్ధికి! అది తీక్షణత్వము అంటే.

మన వెనుకాల ఎన్ని లక్షల, కోట్ల జన్మల జనన మరణాల మధ్యలో మనం మోసుకొచ్చినటువంటి బరువంతా వుందా లేదా? మన గోడాం లో. దాన్ని ఏం చేయాలట? అర్థం చేసుకోవడానికేమో సూక్ష్మత్వం పనికొస్తుంది, పరిశోధించడానికేమో సునిశితత్వం పనికొస్తుంది. మరి తెంచాలి అంటే దానిని తీక్షణత్వము కావాలా వాద్దా? ఎంత తీక్షణత్వము కావాలట? పెద్ద ఊడలతోటి ఒక మర్రిచెట్టు అందుకే దక్షిణామూర్తి ఏ చెట్టుక్రింద కూర్చుని వుంటారండి? (మర్రి చెట్టు). ఎందుకు మర్రిచెట్టుక్రింద వుంటారండీ? ఊడలు దిగిన మర్రిచెట్టు, మామూలు మర్రిచెట్టు కూడా కాదు. ఊడలు దిగిన మర్రచెట్టు క్రిందే దక్షిణామూర్తి బోధిస్తూవుంటారు. ఏ ఆ seen వల్ల మనకు ఏమి బోధిస్తున్నారు? మర్రిచెట్టు ఎవరో కాదు మనమే. మనలో వున్న జీవభావము మర్రిచెట్టు వలె వుందట. అనేక జన్మార్జిత పురాకృత సుకృత దష్కృత విశేష ఫలంగా అలా ఊడలు దిగిపోయి జీవభావము నేనెప్పటికీ జీవుడినేరా, నేనెప్పటికీ ఆత్మస్వరూపం కాదు నువ్వెంత చెవిలో జోరీగ లాగా చెప్పు, నేను మాత్రం ఒప్పుకోను. అని బలంగా మనలో నాటుకు పోయినటువంటి విశేషణాలు ఎన్నైతే వున్నాయో, ఆ గుణబలంచేత, ఆ సంగత్వ దోషం చేత, ఆ మర్రిచెట్టును ఒక్క వేటితో నరికేటటువంటి చండ్ర పరశువు కావాలి. ఒక్కొక్క ఊడ తీస్తే మర్రిచెట్టు చనిపోతుందా? మళ్ళీ వచ్చేస్తాయండీ, ఒక్క ఊడ మిగిలినా మళ్ళీ వచ్చేస్తాయండి. ఆ మర్రిచెట్టుకు వున్న లక్షణము అది. అందుకే అది పెట్టారు. ప్రతీకాత్మకం అన్నమాట అది. జీవభావన పంచకోశాలలో వున్నటువంటి ఏ ఒక్క తాదాత్మత చేతైనా సరే మరల పునః ప్రాదుర్భవిస్తుంది. అదేం పోదు. కాబట్టి ఒక్కవేటుతోటి నరకగలిగే సమర్ధత రావాలట. సమస్తం, ఊడలతో సహా! సమూలచ్ఛేదం చేయగలిగేటటువంటి జ్ఞానఖడ్గాన్ని, చండ్రపరుశువుని, స్వరూపజ్ఞానఖడ్గాన్ని, తీవ్రవైరాగ్యంతో ఎవడైతే చేబూనుతాడో, వాడికి మాత్రమే ఈ తీక్షణంఅనేటువంటి శక్తి వస్తుంది.
ఈ మూడు లక్షణాలు కావు, సమర్ధతలు. గుర్తుపెట్టుకోండి. బుద్ధికి వచ్చినటువంటి ఈ మూడూ కూడా, లక్షణాలు కావవి, సమర్ధతలు. సూక్ష్మత్వము, సునిశితత్వము, తీక్షణత్వము. ఈ సమర్ధత ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు ఏం చూడగలగుతాడు? ఏం చేయగలుగుతాడు? వాడికసలు అడ్డమేమీలేదు. వాడు తెలుసుకోలేని subject ఇహంలో ఏమీ వుండదు. ఇహంలోనే కాదు, పరంలో కూడా వుండదు. అర్థమైందా అండీ! అంతటి సమర్ధత ఆ బుద్ధికి ఏర్పడుతుంది. ఇలా ఏర్పడేట్టుగా మనం పరిణామం చెందడమే నిజమైన సాధన. ఇది నిజమైన సాధకుడు. తీవ్ర మోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యం ఈ తీక్షణత్వం అనే లక్షణానికి చాలా అవసరం. వాళ్ళకు మాత్రమే ఇది సాధ్యమౌతుంది. మిగిలిన వాళ్ళకు అసాధ్యం. ఏదో విచారణ చేస్తూనే వుంటారు జీవితమంతా. నేను ఎంతోమంది సాధకులను చూశానండీ!  అందరూ ఏదో ఒక సాధన చేస్తూనే వుంటారు, ఏదో ఒక విచారణ చేస్తూనే వుంటారు. కానీ ఈ సూక్ష్మత్వము, సునిశితత్వము, తీక్షణత్వము అన్న మూడు లక్షణాలలో పరిపూర్ణమైన స్థితిని సాధించినప్పుడు మాత్రమే నువ్వు ఆ చైతన్య స్థితిని, ఆత్మస్వరూపజ్ఞానాన్ని సులభంగా పొందుతావు. ఒక్కక్షణంలో పొందవచ్చు. ఈ మూడు లక్షణాలు వుంటే ఆత్మసాక్షాత్కారానికి ఒక్కక్షణం కూడా ఎక్కువే. లిప్త. లిప్త అంటే? (కనురెప్ప మూచి తెరిచేందుకు పట్టే సమయం) అంతే ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. మరిప్పుడు మనం ఎంతకాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాం? నిరంతరాయంగా మనలో ఈ మూడు లక్షణాలకు సంబంధించినటువంటి వేదన కలగాలి. దాని గురించి పిపాస ఆ దాహం కలిగితే దాన్ని తీరుస్తావు అంతేనా కాదా! అవి లేకపోతే, మీకు ఉదాహరణ చెప్తా!
మీరెప్పుడూ చదవనటువంటి వేదాంత గ్రంథాన్ని స్వీకరించండి. జీవితంలో ఎప్పుడూ అసలు దాని పేరు కూడా వినలేదు. అటువంటి వేదాంత గ్రంథాన్ని స్వీకరించండి. మీకు మీరు వేదాంత గ్రంథాన్ని దగ్గరపెట్టుకుని, మీరు అప్పుడే చదవాలి అప్పుడే చెప్పాలి. Spot లో. Spot Examination వుంటుంది తెలుసా మీకు? వుంటుందా? వుండదా? అంటే ఏమీ preparation వుండదు. ఏం చెప్తారో ఏమీ వుండదు. ఏం syllabus వుండదు పాడు వుండదు. మీ చేతికి ఒక పుస్తకం ఇస్తాం. వెంటనే అది తీసుకుని మీరు అక్కడ కూర్చున్న వాళ్ళకి సుబోధకమయ్యేటట్లుగా దానిని బాగా చెప్పాలి. అర్థమయ్యేటట్లు చెప్పగలగాలి. ప్రయత్నం చేయండి. అప్పుడేమి పనిచేయాలి మనకి? ఒకేసారి చదవాలి, అధ్యయనం చేయాలి, బేరీజు వేయాలి, నిర్ణయం తీసుకోవాలి, తీసుకుని ఏం చేయాలి? మరలా చదువరిని తెలుసుకోవాలి. వాడిస్థాయి ఎక్కడుందో తెలుసుకోవాలి. క్రమానుగతిశీలంగా వాడిని అభివృద్ధి చేసి నీ స్థాయికి తీసుకురావాలంటే ఎలా వాడికి చెప్పాలో తెలుసుకోవాలి. ఎలా బోధించాలో నేర్చుకోవాలి. ఎలా సహాయం చేయాలో తెలుసుకోవాలి. దగ్గరవుండి సహాయం చేయాలి. వాడికి అర్థమయ్యేట్లు చేయాలి. ఇప్పుడు వీటిలో ఈ మూడు లక్షణాలు వున్నాయా? లేదా? సూక్ష్మత్వము వుంది, సునిశితత్వము వుంది, తీక్షణత్వము కూడా వుంది. మరి ఎప్పుడన్నా జీవితంలో Try చేశామా? మనం ఎప్పుడూ మనకు తెలిసినవి చెప్పడానికే try చేస్తాం. అంతేనా కాదా? వివేకచూడామణినాకు తెలిసి 10 ఏండ్ల నుంచి 12 ఏండ్ల నుంచి చదువుతున్నవాళ్ళు వున్నారు. ఇంకొక 10 ఏళ్ళు 15 ఏండ్ల పాటు చదువుతారు. ఎందుకని? అందులో ఎక్కడా కూడా లక్ష్యనిర్దేశ్యము లేదు. మీరు చదవడం మంచిది, చదువుతారు. భగవద్గీత -  108 గీతాయజ్ఞములు చేస్తూనే వుంటారు. 700 శ్లోకాలు కంఠతా వచ్చు. ఏమన్నా మారామా? ఏం మారలేదు.
కాబట్టి జీవితాన్ని స్వకార్యంగా చూసినంతకాలం, నువ్వు కర్మఫలానికి లొంగక తప్పదు. ఇది స్వామికార్యం”. అప్పుడు ఎవరు పోయారు? నువ్వులేవు. నువ్వు లేకుండా ఆ స్థానంలోకి ఎవరొచ్చారు ఇప్పుడు? ఈశ్వరుడు వచ్చాడు. సర్వాధిష్టానం అయినటువంటి ఈశ్వరుడు వచ్చాడు. ఇది ఎవరి పనయ్యా? Whose work is this? నాపని కాదు. అంతేనా కాదా? కానీ, ఇందాకే చెప్పా. ఇదంతా ఎందులో వుండాలి? భావాద్వైతం సదా ఆచరేత్‌. బుర్రలోపల వుండాలండి. Not బయిట. ప్రవృత్తిలో కాదు. అర్థమైందా? ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఎవరిపనయ్యా ఇది? ఈశ్వరుడిది అంటే కుదరదు. క్రియాద్వైతం న కుర్యాత్‌. ఎప్పుడూ కుదరదండీ! కంచం ముందల కూర్చుని ఇదంతా అద్వైతమే కదా! ఇక్కడ వుంది అక్కడ వుంది కదా, అక్కడ వుంది ఇక్కడుంది కదా! అని అన్నం తినకుండా కూర్చుంటే నువ్వు శోష వచ్చి పడిపోవడం ఖాయం. స్థూలమైన ధర్మానికి దీన్ని వినియోగించరాదు. ఎక్కడ ఆచరించాలి దీనిని? లోపల. నివృత్తి మార్గంలో. నీ బుద్ధిని కడగడానికి. శుద్ధబుద్ధివి అవ్వడానికి. చైతన్యస్వరూపాన్ని తెలుసుకోవడానికి. అప్పుడేమైందీ కర్మ. అప్పుడు కూడా కర్మే.
ఇప్పటి వరకూ ఏమయినాయి కుకర్మ’- పోయింది. సుకర్మ– పోయింది. ఇంకేమి మిగిలిపోయినాయి? అకర్మ’, ‘వికర్మ. రెండున్నాయి ఇక. అర్థమైందా అండీ? అకర్మ, వికర్మ చెప్పాలి. వికర్మ’- అంటే ఏమిటీ? ఏమీచేయడు వాడు. ఊరక రాయివలె వుంటాడన్నమాట. అంటే ఏమీ చేయకపోతే ఏ గొడవ రాదు కదా అని, అప్పుడు మరి ప్రవృత్తిలో వున్నాడా? నివృత్తిలో వున్నాడా? ప్రవృత్తిలోకి వచ్చేసావుగా. నివృత్తిలో వున్నప్పుడు గొడవరావడం, గొడవపోవడం వుందా? లేదుగా. కాబట్టి అసలు శరీరధారులకు వికర్మ సాధ్యమా? శరీరాన్ని ధరించి వున్నవాళ్ళకు వికర్మ సాధ్యమా? ఏ కర్మ చేయడం లేదండీ, Not possible. కాబట్టి శరీరధారులకు వికర్మ లేదు. ఎందుకనయ్యా? గాఢనిద్రావస్థలో కూడా నిద్రాసుఖాన్ని అనుభవిస్తున్నావ్‌. నువ్వు తెలిసి అనుభవిస్తున్నావా? తెలియక అనుభవిస్తున్నావా? చూసి అనుభవిస్తున్నావా? చూడక అనుభవిస్తున్నావా? I don’t know. అనుభూతి వుందా? లేదా? వుంది. వుంది అంటే కర్మఫలం వుంది. అది సుఖమైనా, దుఃఖమైనా. కర్మ చేయబడుతుంది. అనుభవించబడుతుంది. అర్థమైందా? అండీ! కాబట్టి, వికర్మఅన్న ప్రసక్తే లేదు. తత్త్వజ్ఞాన దృష్ట్యా వికర్మఅన్నటు వంటి స్థానమే లేదు శరీరధారులకు. ఒకటి పోయింది. ఇక మిగిలింది ఏమిటి? అకర్మ- అకర్మ అంటే? చేసీ చేయనివాడు. చేసీ చేయనివాడు. మనకు అసలు జీవితంలో ఎప్పుడైనా అలా వుందా? చేసీ చేయకపోవడం అనేది జీవితం ఎప్పుడన్నా ఒకటి వుందా? ఏదైనా ఒకటుందా? ఒకటి చెప్పండి చూద్దాం. మీరు చేసీ, చేయని వాళ్ళు అయ్యివుండాలి. అలాంటిది ఏమైనా జీవితంలో ఒకటి వుందా? ఏమీలేదా? ఏమిటది? (‘నేనుఅన్న భావన లేకుండా చేయడం) ఏం చేస్తున్నావ్‌? అలా ఒక్కటన్నా చేశావా జీవితంలో? నువ్వు తెలిసే ఊపిరి పీల్చి విడిచిపెడుతున్నావా? ప్రయత్నించి ఊపిరి తీసుకుని విడిచిపెడుతున్నావా? Voluntary, Involuntary మనలో రెండున్నాయి ఇక్కడ. నీ ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోతూ వుంటాయి. నీ బుద్ధిని అడగవు అవి. అర్థమైందా అండీ! వాటిపని అవి చేసుకుపోయేవి వున్నాయి. కానీ అవి భౌతికములు. మనకి ఈ సిద్ధాంతానికి అవి పనికిరావు. అంటే గుండె కొట్టుకోవటం, రక్త ప్రవాహం జరగడం, శరీరంలో వున్నటువంటి bio-mechanism అంతాకూడా. ఇదంతా కూడా నీవు అనుకుని చేయక్కర్లేదు. అదే జరిగిపోతుంది. కానీ కర్మఫలంలో ఇదికూడా భాగమే. అవి ఏవైనా పని చేయకపోతే నీకు దుఃఖం వస్తుంది. వస్తుందా? రాదా? గుండె కొట్టుకోవడం ఒక్కసారి తప్పనివ్వండి, ఒక్కసారే కదా! పోనీలే కదా! అని ఒప్పుకుంటే ఏమయ్యింది? ప్రమాదం వస్తుంది. కాబట్టి అవి కూడా కర్మఫలంలో భాగమే. కానీ అవి గౌణములుకావు. అప్రధానములు. సామన్యంగా జరిగిపోతుందన్నమాట. నీ ప్రమేయం అవసరం లేదు. సృష్టి ధర్మం ప్రకారం జరిగిపోవలసినది, జరిగిపోతుంది. మనం అనుకునేటు వంటి అకర్మదగ్గర ఎక్కడ? నువ్వు చేసిచేయని వాడిగా ఎక్కడైనా ఒక్కచోట వుందా? అసలేం లేదా? జీవితం మొత్తం మీద. తిరగేయండి. వెనక నుంచి ముందుకి. జీవితం మొత్తం మీద అలాంటి ఒక ఉపమానం చెప్పండి. (నా ప్రశ్నలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ నిజజీవితంలో మీరు ఈ దృష్టికోణంతో ఆలోచిస్తున్నారా? లేదా? ఆలోచింపజేయడమే నా పని, మిగిలిన పనులు నావి కావు, మిగిలినదంతా మురళీ కృష్ణగారి పని. మీకు శాస్త్రం చెప్పడం, ఆ వాక్యాలు చెప్పడం, అదంతా పాఠాలు, వగైరాలు చెప్పడం నా పని ఒక్కటే, నేర్చుకున్న శాస్త్రాన్ని నిజజీవితంలో వాడకపోతే కేవలం అటకమీద పుస్తకమే Use less). అదుగోండి, ఈవెడేదో మొక్కనాటింది, మొక్కనాటితే నీళ్ళు పోసింది, మొక్క వృద్ధి చెందుతోంది. నువ్వే పెంచావా దానిని? నువ్వు పెంచలేదా? పంచభూతాల సహాయంతో అది వృద్ధి చెందుతోందండి. కానీ నిమిత్తమాత్రంగా నువ్వు ఏం చేస్తున్నావ్‌? (నీళ్ళు పోస్తున్నావ్‌). నిమిత్తమాత్రంగా అంతేనా కాదా? నేను నీళ్ళు పోయకపోతే ఇది గ్యారెంటీగా చస్తుంది. అవకాశం వుంది. కానీ నువ్వు నీళ్ళు పోయకపోయినంత మాత్రానా అది చావకపోవడానికి కూడా అంతే అవకాశం వుంది. ఎందుకని? అడవుల్లో చెట్లకి ఎవరు నీళ్ళు పోశారు? మనం నీళ్ళు పోయక్కర్లేదు. అర్థమైందా? పంచభూతాల సహాయంతో పరిణామం చెందే లక్షణాలు ఏవైతే వున్నాయో, వాటికి మన ప్రమేయం లేదక్కడ. అవునా కాదా? అదే ఇందాక చెప్పింది. అయితే మన నిజ జీవితంలో నేను ఇందాక మీరంతా స్వకర్మ అంటున్నారే, ఆ స్వకర్మ అన్న స్థితిలో నీ ప్రమేయం లేకుండా, నువ్వు కర్తగా లేకుండా, జరుగుతున్నది ఏదైనా ఒకటుందా? నేను కర్తను కాదు. కానీ చేస్తావ్‌. నువ్వు కర్తవి కాదు, కానీ కచ్చితంగా ఆచరిస్తావు. సరే, సరే, సరే. మీకది అందదు natural గా. నాకు తెలుసా విషయం.
మీ మనవరాలిని LKG లో ఒక school లో వేయాలండి. ఎవరి నిర్ణయం ప్రకారం జరుగుతుంది? ఆ పిల్ల వాని తల్లి తండ్రి నిర్ణయం ప్రకారం జరుగుతుంది. మీకేం బాధ్యత లేదా? As Grandparent? డబ్బులుంటే donation కడితే చాలంట grandparent. మనకేం బాధ్యత లేదా? వుందా లేదా? వుంటుందా లేదా? నిమిత్తమాత్రం. వుంది. ఎలా వుంది? నిమిత్తమాత్రం. బాధ్యత లేదా? వుంది, నిమిత్త మాత్రం. అర్థమైందా అండీ! ఇప్పుడు మీరు కర్తయేనా ఆ పిల్లవానికి? కాదు అంటున్నారా లేదా? అవునా కాదా? బాధ్యతను బట్టి, కర్మఫలం A=B అవుతోంది. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. బాధ్యతను బట్టి A=B అవుతోంది అది. కర్మఫలం ఏర్పడుతోంది అక్కడ. నేను బాధ్యుడిని కాదు అన్న వాడికి కర్మఫలం ఏర్పడుతుందా? ఏర్పడటం లేదుగా. అతను అబాధ్యుడు అంటుంది శాస్త్రం. ఈశ్వరుని గురించి, ఆత్మ గురించి, చైతన్యం గురించి, ప్రజ్ఞ గురించి, సాక్షి గురించి మాట్లాడుతున్నప్పుడు అతను అబాధ్యుడు అంటుంది. వాడికేం బాధ్యత లేదు ఆ విషయంలో. ఎవరెటుపోయినా, ఎవరేమైపోయినా,
యాదవ కులం అంతా కూడా ద్వాపర యుగాంతంలో ఆఖరికి పోయింది ఎవరు? ఆఖరికి పోయింది ఎవరు? శ్రీకృష్ణుడు యాదవులలో భాగం కాదా? యాదవులందరూ పోవాలని శాపం పొందారా లేదా? పోయారా లేదా? ఈయన కూడా పోవాలా వద్దా? ఏయ్‌! నేను పరమాత్మని నేను పోను అంటే? కుదురుతుందా కుదరదా? కుదురుతుందా కుదరదా? కుదరదా? కుదరకపోతే పరమాత్ముడు ఎట్లా అవుతాడు? కుదరాలా? కుదరకూడదా? సమర్ధుడై వుండి సృష్టి ధర్మానికి లొంగిన వాని వలె వున్నాడు. కానీ వాస్తవంగా పరమాత్మ. సృష్టికి అతీతమైనవాడు. అర్ధమైందా అండీ?
నీలో వున్న జీవుడు కూడా, స్వరూపజ్ఞాన విశేషం చేత - ఆత్మ స్వరూపుడు. కానీ కర్మవశం చేత – శరీరధారిగా వున్నాడు. మనలోనే ఇక్కడ రెండున్నాయి ఇప్పుడు. ఒకటి ఎవడు? ఆత్మస్వరూపుడు. స్వరూపజ్ఞానం కలిగినవాడు. వాడికి అన్నీ విశేషణాలే. వాడికి అన్నీ జ్ఞానవిశేషణాలే. వాడికి ఎక్కడా ఏ మాలిన్యం లేదు. ఆవరణం లేదు, విక్షేపం లేదు. ఏ గొడవల్లేవు వాడికి. వాడు నిరామయుడు, నిరంజనుడు, నిర్వికారుడు. ఈ లక్షణాలన్నీ వాడికి వున్నాయి. కానీ శరీరధారియై వున్నందు వల్ల, కర్మ విశేషం చేత, ప్రభావితం అయినట్లు కనబడుతాడు. కనబడుతున్నాడా? వున్నాడా? వున్నాడు అంటే జీవుడు. వేరే ఏమీ లేదు ఇందులో. కర్మప్రభావం చేత వున్నాడు. జీవుడే. వాడికి ఆత్మ విశేషం తెలీదు. కర్మ ప్రభావం చేత వున్నట్లుగా వున్నాడు. నిమిత్తమాత్రం. శరీరధారి కాబట్టి. అన్నప్పుడు ఏమయ్యావ్‌? అబాధ్యుడు. నాకేం సంబంధం లేదు. అట్లా నిమిత్తమాత్రంగా కనుక వుండడం నీకు వచ్చినట్లయితే, ఇది రావాలంటే బుద్ధికి ఏ లక్షణాలు వుండాలి? సూక్ష్మత్వం వుండాలి, సునిశితత్వము వుండాలి, తీక్షణత్వము వుండాలి. అప్పుడు నువ్వు ఎలా వుంటావ్‌? నీ బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. ఓహ్‌! ఇది ఇక్కడ అంటుతోంది, కాబట్టి ఇప్పుడు మనమేం చేయాలి? ఎక్కడ సంగత్వదోషం ఏర్పడుతోందో, అక్కడ కర్మ ఏర్పడుతుంది. ఎక్కడ సంగత్వదోషం లేదో అసంగుడవో అక్కడ కర్మ నిన్నేం చేయదు. అప్పుడు నువ్వేమయ్యావ్‌? కర్తృత్వ రహిత కర్మాచరణ”. నిమిత్తమాత్రంగా జరగవలసినవి జరుగుతున్నాయి. నీకేం వాటిమీద దృష్టిలేదు. నీకేం వాటిమీద కర్తృత్వభావన లేదు. నీకేం వాటి యెడల భోక్తృత్వ భావన కూడా లేదు. ఎప్పుడైతే కర్త, భోక్త అన్న లక్షణాలు లేకుండా నువ్వు వున్నావో, అప్పుడేమయ్యావ్‌? అప్పుడేమయ్యావ్‌? నీవే చైతన్యం. నీవే ప్రజ్ఞ. నీవే ఆత్మ. ఈ నేను కాస్తా జీవభావ పరధిని అతిక్రమించింది. ఈ అతిక్రమించేటప్పుడు వ్యతిరేకం చేయాలా? అనుకూలం చేయాలా?

పాండవులు చెప్పినవన్నీ శ్రీకృష్ణుడు ఆమోదించాడా? వ్యతిరేకించాడా? ఆయన ఆమోదించ లేదు, వ్యతిరేకించలేదు. నిమిత్తమాత్రం. సలహా చెప్పాడు అంతే.
నేను (అర్జునుడు) యుద్ధం చేయాలయ్యా!
అయితే అస్త్రాలు సంపాదించు, వెళ్ళి తపస్సు చెయ్యి.
నేను (ఉద్ధవుడు) యుద్ధం చేయనయ్యా!
అయితే ప్రశాంతంగా తపస్సు చేయి.
అరె! యుద్ధం చేస్తానయ్యా అన్నవాడికీ తపస్సేనా? యుద్ధం చేయనయ్యా అన్నవాడికి తపస్సేనా? ఏంటి? What it this? అక్కడ కామ్యక కర్మ. అస్త్రాలు కావాలి నీకు.
యుద్ధం చేయాలంటే ఏం కావాలి?
దైవజ్ఞానం అక్కర్లేదు నీకు. (యుద్ధం చేసేవానికి)
ఉద్ధవుడు వున్నాడండీ, నాకేం పని లేదు అన్నాడండీ,
అయితే నువ్వుకూడా తపస్సు చేయి అన్నాడు.
అర్జునుడు ఏమన్నాడు?
యుద్ధం చేస్తానన్నాడు, అయితే నువ్వుకూడా తపస్సు చేయి అన్నాడు.
ఈయన తపస్సుకి ఆయన తపస్సుకి తేడా ఏమిటి?
ఈయనకేమో దివ్యజ్ఞానము కావాలి, ఆయనకేమో అస్త్ర జ్ఞానము కావాలి. అస్త్ర, శస్త్రాలకు సంబంధించిన జ్ఞానము కావాలి.
కాబట్టి ఇప్పుడు ఆయనేం చేశాడు (అర్జునుడు)?
తపస్సే చేశాడు. కామ్యక కర్మ చేశాడు.
ఉద్ధవుడు ఏం చేశాడు?
నిష్కామకర్మ చేశాడు.
కాబట్టి, శ్రీకృష్ణుని వల్ల జ్ఞానం పొందినవాడు ఉద్ధవుడొక్కడే. మిగిలినవాళ్ళు అందరికీ అతను పరమాత్మే. కానీ, దైవీజ్ఞానాన్ని పొందడానికి ఆయన్ని ఉపయోగించుకోలేదు. అర్థమైందా? ఇప్పుడు మనలోపల వున్నటువంటి ఆత్మస్వరూపజ్ఞానాన్ని మనం దేనికి వాడుకోవాలి? దైవీ స్థితులని, దివ్యజ్ఞానాన్ని, ఆ బ్రాహ్మీ స్థితిని, ఆ పరబ్రహ్మనిర్ణయాన్ని పొందడానికి వాడుకుంటే, అప్పుడేమయ్యావ్‌? ఇది దాటిపోయింది, అవతలకు వెళ్ళిపోయావ్‌. అదే ఇటుతిరిగిందది. అప్పుడేమయ్యావ్‌? ఇటుతిరిగిపోయావ్‌. ఇహ చెప్పక్కర్లేదు, దీనిగురించి మనకు బాగా తెలుసు. అర్థమైందా అండీ! కాబట్టి ఎప్పటికప్పుడు మనం పురోగమనం అంటే, నీ జ్ఞానవిశేషంలో వ్యవహారజ్ఞానం వరకే వుంటున్నామా? ఇంద్రియ జ్ఞానం వరకే వుంటున్నామా? విచారణ జ్ఞానం వరకే వుంటున్నామా? స్వరూపజ్ఞానంలో వుంటున్నామా? స్వరూప జ్ఞానంలో మరలా చైతన్యం, ప్రజ్ఞ, ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ. ఈ రకమైన వ్యాపకధర్మంతోటి సర్వవ్యాపకమైనటువంటి లక్షణాలను, సర్వవ్యాపకమైనటువంటి స్థితిని, అనూభూతమొనర్చుకొనేటట్లుగా జీవనం సాగుతుంది. ఆ సాగే దశలో, ఈ నిద్ర అనేటటువంటి దిగుడుబావిని దాటామా? దాటలేదు. ఎందుకనిట? అదే పెద్ద అగడ్త.
జీవభావానికి, ఆత్మభావానికి మధ్యలో వున్న పెద్ద దిగుడుబావి ఏంటయ్యా అంటే నిద్రే.
            వేరే ఇంకేమీ లేదు. ఈ మూట తగ్గిపోతే ఆ బావిలో పడేపని తగ్గిపోతుంది. ఈ మూట తగ్గకపోతే, రోజూ ఆ బావిలో పడాల్సిందే. పడకపోతే నీకు విశ్రాంతి రాదు. సమస్యేలేదు అందులో. అర్థమైందా అండీ! మెలకువ, కలలో కనుక నీ బరువు తగ్గకపోతే, నీ విధానం మారకపోతే, నీ జీవనం మారకపోతే, నువ్వు తప్పనిసరిగా విశ్రాంతిని పొందాలంటే ఎందులోకి పోవాలి? ఆ దిగుడుబావిలో పడాల్సిందే. పడి విశ్రాంతి పొంది, ఆ సుఖాన్ని అనుభవించి, మరలా ఉదయానికి లేచేటప్పటికి, ఆహా! ఎంతబాగా లేచానో, కొత్త శక్తితోటి లేస్తారన్నమాట, నూతనమైనటువంటి శక్తితో.
ఈ నూతనమైనటువంటి విషయ చాంచల్య శక్తితో లేస్తున్నాం. అర్థమైందా అండీ! నూతనంగా మనం ఎందులో ప్రయాణం చేస్తున్నాం? ఇవాళ ఏ కొత్త విషయాలను చూద్దాం? ఇవాళ ఏ కొత్త విషయాలను చేద్దాం? ఏ కొత్త సుఖాన్ని అనుభవిద్దాం? ఏ కొత్త దుఃఖాన్ని దూరం చేద్దాం? ఈ విషయ ప్రణాళికతో లేస్తున్నాం. ఈ విషయ విచారణతో మెలకువలోకి వస్తున్నాం. తద్వారా మన అంతరేంద్రియాలు అన్నీ, ఎప్పటికప్పుడు ఏమైపోతున్నాయి? మల విక్షేప ఆవరణ దోషాలతో కూడుకుని, నిరంతరాయంగా ఈ త్రిదోషములే, ఈ మల విక్షేప ఆవరణ దోషములే జీవభావమై, అనేక జన్మార్జితంగా మనల్ని ఈ పరిమితికే వుంచుతున్నాయి. ఈ జీవనసత్యాన్ని ఎవరైతే నిజజీవితంలో గ్రహిస్తారో, దీన్ని అధిగమించి తురీయస్థితిలో నిలబడాలనే లక్ష్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, తురీయానుభవం లేకుండా ఆత్మానుభూతి అసాధ్యం. ఇవి రెండు సమానం. తురీయస్థితి, ఆత్మానుభూతి. ఈ రెండూ A=B.  ఈ స్థితికి వచ్చినవాడిని కర్మయేమీ చేయజాలదు. వాడు కర్మను అధిగమించినటువంటి వాడు. వీడు ఓంకారంఅనే రథాన్ని అథివశించినవాడు. వీడి శక్తి ఏంటయ్యా? అంటే, వీడు దేహమనే రథాన్ని అథివశించలా, ఓంకారమనే రథాన్ని అథివశించినటువంటివాడు. ఓంకారం అనే ప్రణవనాదాన్ని శరీరంగా మార్చుకున్నటువంటి వాడు. వాడి సమర్ధత అది. కాబట్టి ప్రణవోపాసన చేసేటటువంటి వాళ్ళకి, తురీయంలో ప్రవేశం సాధ్యం అవుతుంది. ఆ ప్రణవనాదం చేతనే నీ లోపల వున్నటువంటి పంచభూత శక్తులు పనిచేస్తున్నాయి. ఈ సత్యాన్ని అనుభూతిలో గ్రహించాలి. ఈ అనుభూతి చేతనే ఇది సాధ్యం అవుతుంది. మాటలతో చెప్పడానికి వీలుకాదు. ఏ ఉపసనైనా, ఏ సాధనైనా ఎవరికి వాళ్ళు స్వానుభూతిగా తెలుసుకోవాల్సిన అంశమే తప్ప, చెవిలో మంత్రం చెప్తేనో, లేకపోతే పైన శాలువా కప్పితేనో, అయ్యేపని కాదు. కాకపోతే అది ఒక ప్రారంభం. అక్షరాభ్యాసం ఎలాగో, ఇవన్నీ అలా అవసరం. ఈ స్కూల్లో మీరు పాఠం నేర్చుకోవాలి. స్కూల్లో పాఠం నేర్చుకుంటే జీవితం అయిపోతుందా? No. స్కూల్లో పాఠం నేర్చుకోవడంతో మొదలౌతుంది. విద్యాభ్యాసం మొదలైంది, దాన్ని నిజజీవితంలో జీవించాలి. అయితే, ఈ విద్యకి ఎప్పుడో మన వ్యవహారిక విద్యలాగా ఓ పాతికేళ్ళు నేర్చుకుంటానండీ, తరువాత పాతికేళ్ళలో చేస్తనండీ అంటే, మనం మొదలు పెట్టిందే ఎప్పుడూ? సగం జీవితం అయిపోతే తప్ప ఈ పాఠశాలకు రాకపోతివి. అర్థమైందా అండీ! ఇంకా నేర్చుకోవడానికి ఒక 50 ఏండ్లు పట్టిందనుకోండి. ఇంకెప్పుడు చేస్తా? వచ్చే జన్మకు ఇది గుర్తుండదు. వుంటుందా? ఇవాళ విన్నది రేపటికే గుర్తుండటం లేదు. ఇక వచ్చేజన్మకు ఏమి గుర్తు వుంటుంది. అవునా? కాదా? కాబట్టి, ఎవరికి వాళ్ళు ఎప్పటి కప్పుడు, మీరు గ్రహించినదాన్ని ఆచరించేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఆచరణ శీలత లేకపోయినట్లయితే ఈ విద్యలో ఒక్క అడుగుకూడా ముందుకుపడదు. మేం అన్ని గ్రంథాలు చదివామండి, ఇన్ని ఉపన్యాసాలు విన్నామండీ, 20 ఏండ్ల నుంచీ ధ్యానం చేశామండీ, 20 ఏళ్ళ నుంచి యోగం చేశామండీ, భగవద్గీత కంఠతా వచ్చండి. ఏ పరిమితులు పనికిరావు. నువ్వు నిద్రపోగానే ఇవేమీ వుండవు. ఒక్కక్షణంలో అన్నీ తుడిచిపెట్టేస్తుంది. ఏమన్నా మిగులంటూ వుంటే, ఒక్క స్వరూపజ్ఞానమే నీతో వుంటుంది. మిగిలినవన్నీ పోతాయి. కాబట్టి, ఈ మూడవస్థలనేటువంటి అగడ్తలు ఎవరైతే దాటగలుగుతారో, వాడు మాత్రమే ఈ గుర్తు స్పష్టంగా పట్టుకోవాలండీ! “అవస్థాత్రయాతీతః. అర్థమైందా అండీ! ‘పంచకోశ వ్యతిరిక్తఃఏంటండీ పాఠం అదీ? మీ అందరికీ బాగావచ్చు.
శరీరత్రయ విలక్షణః, అవస్థాత్రయాతీతః, పంచకోశ వ్యతిరిక్తః – ఇదిట అండీ! ఆత్మలక్షణాలు. ఈ లక్షణాలను మనం నిజజీవితంలో కలిగివుండాలి. అవునా కాదా? పాఠం వస్తే సరిపోతుందా? అబ్బే, పాఠం నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాలి. పంచకోశాలు అంటే ఏమిటో తెలియాలి. అవస్థాత్రయం అంటే ఏమిటో తెలియాలి. శరీరత్రయం అంటే ఏమిటో తెలియాలి. వాటి యొక్క విశేషణాలు ఏమిటో తెలియాలి. వాటి వ్యవహారం అంటే ఏమిటో తెలియాలి. ఆ సాంఖ్యం అంతా తెలియాలండి. కానీ, అందరూ ఈ సాంఖ్యవిచారణ చేసి, పశాంతంగా నిద్రపోతున్నారు. అది వచ్చిన తగాదా! సాంఖ్యంతోటి ముక్తి రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. సాంఖ్య, తారక, అమనస్క పద్ధతిగా మాత్రమే ముక్తిసాధ్యమౌతుంది.
సాంఖ్యంనుంచి తారకం నకు ఎదగకపోయినట్లైతే, తరించటం, లంఘించడం అది లేకపోతే? ఎందుకు నేర్చుకున్నావ్‌? కష్టపడి బుర్రంతా చెడగొట్టుకుని, ఈ పని ఇంకేదన్నా చేసుంటే, ఈ పాటికి కోట్లు సంపాదించేసేవాడిని. నీకున్న తెలివితేటలకి. బోల్డు మంది, ఈ దేశాన్నే manage చేసేటన్ని తెలివితేటలు వస్తాయి. ప్రపంచాన్ని manage కూడా చెయ్యొచ్చు. కానీ, అవన్నీ కాదు’- అనుకుని కదా! ఈ విద్యకు వచ్చావు. సాంఖ్యం నేర్చుకున్నావు. నేర్చుకున్న సాంఖ్యాన్ని కట్టకట్టి అటకమీద పెడితే ప్రయోజనమేముంది? వజ్రాలని వేప విత్తనాలకి వెలపోస్తారా ఎవరైనా? సాంఖ్యం అనే వజ్రాలు ఏరుకున్నారండీ! వచ్చారు, విద్యనేర్చుకున్నారండీ. ఈ వజ్రాలమూట పట్టుకెళ్ళి, ఒక బస్తాడు వేపవిత్తనాలు ఇమ్మన్నాడంట ఒకడు. వాడెంత మూర్ఖుడు అని అనుకుంటున్నావో, నీవు కూడా సాంఖ్యం నేర్చుకున్నవాళ్ళు ఎవరైతే, ఇంకా జీవభావంలో మిగిలివున్నారో, వాళ్ళందరూ కూడా ఈ వేప విత్తులకు వజ్రాలను వెలకట్టేటువంటి వారు. అంటే ఈ సాంఖ్యదృష్టి స్థిరపడలేదన్నమాట. ఎవరికైతే ఈ సాంఖ్య విచారణా దృష్టి స్థిరపడుతుందో వాడికి సంకెళ్ళు వీడుతాయి.

సంకెళ్ళు వీడటం అంటే ఏమిటి? నీలో అసలు జీవభావానికి అవకాశం లేదు. ఆ రకమైనటువంటి స్థితి మీలో స్పష్టంగా ఏర్పడుతుంది. కాబట్టి, అలా ఎదిగినప్పుడు మాత్రమే మీకు ఈ గురుపౌర్ణములుగానీ, ఉపదేశాలుగానీ, ఉపన్యాసాలు గానీ, గ్రంథాలు కానీ, మీలో వున్నటువంటి భక్తి విశ్వాసాలు కానీ నిజంగా మీకు ఉపయోగపడేది. లేకపోతే ఇది పూర్ణంగా శుష్కవేదాంతంగా జీవితంలో మిగిలిపోతుంది. వెనక్కు తిరిగి చూసుకుంటే, ఏమీ మిగలదు. కాలహరణం మిగుల్తుంది. అలావుండకుండా వుండాలి అంటే, మనమందరమూ కూడా యథార్థమైన ప్రజ్ఞలో, నిజప్రజ్ఞలో, నిజ ఆత్మలో, ఇలాంటి మాటలన్నీ మీకు శాస్త్రంలో వస్తాయండి. మీరు ఏ శాస్త్రం అన్నా తిరగేయండి. నిజానుభవంలో, మీరు స్థిరంగా వున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. అలాంటి నియమబద్ధత, అలాంటి కంకణం మనం కట్టుకోవాలి. అలాంటి నిబద్ధతని, నియమాన్ని, స్వీకరించడానికే మీరందరూ ఎవరికి వాళ్ళు, గురువుగారి సమక్షంలో, ఈశ్వరుని సమక్షంలో, ఒక నియమాన్ని – నా బలహీనత ఇది”. దీనిని ఏ పరిస్థితిల్లో ఈ క్షణంలో నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ క్షణం నుంచి నేను దీన్ని విడిచి పెట్టాను. ఈ క్షణం నుంచి నేనే దీనికి లొంగను. ఈ క్షణం నుంచి నేను దీన్ని అథిగమించి వుంటాను. అని ప్రకృతికి అతీతముగా వున్న అధిగమించినటువంటి స్థితిలో వున్నటువంటి వారి సమక్షంలో, మీరు ఆ నిర్ణయం తీసుకుని, నిజజీవితంలో నిలబడే ప్రయత్నం చేసి, ఆర్తితో వేడుకుని, దాన్ని అధిగమించేటువంటి స్థితిని సాధించడం కోసమే ప్రతి సంవత్సరం గురుపౌర్ణమిలు పెట్టేది అందరూ. అన్ని ఆశ్రమాలలో. అలా అయితేనే, మీకు నిజశిష్యులు అయ్యేటటువంటి అవకాశం వస్తుంది. అలా అయితేనే మీరు (దాన్ని) మారి ఆ స్థితిని సంపాదించడానికి ఉపయోగపడుతుంది. అలా మీరందరూ జీవించాలని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినందులకు మీ అందరికీ ధన్యవాదాలు.